ఒక్క ఫ్లాప్ కే కెరీర్ కతం అనుకున్నాను : కియారా అద్వానీ
December 1, 2020 / 03:46 PM IST
|Follow Us
కెరీర్ ప్రారంభించిన 4ఏళ్ళకే స్టార్ హీరోయిన్ అయిపోయింది కియారా అద్వానీ. తెలుగులో ఈమె చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈమె అగ్ర కథానాయికగా రాణిస్తుంది. ‘ధోనీ’ ‘కభీర్ సింగ్’ చిత్రాలు ఈమె ఇమేజ్ ను అమాంతం పెంచేసాయి. ఇప్పుడు అక్కడి స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది కియారా అద్వానీ. తెలుగులో కూడా ఈమె నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ అవ్వడంతో ఈమె తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ఓ పక్క సినిమాలు.. మరోపక్క వరుస ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉండగా..కియారా ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన కెరీర్ ప్రారంభంలో ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులను ప్రేక్షకులతో పంచుకుంది.ఆమె మాట్లాడుతూ.. ” నేను నటించిన మొదటి చిత్రం ‘ఫగ్లీ’ నిరాశపరచడంతో రెండో సినిమా అవకాశం వస్తుందా లేదా అని భయమేసింది. నిజానికి అందరూ నా తొలి చిత్రం ‘ఎం.ఎస్.ధోని’ అనుకుంటారు.
కానీ నా మొదటి చిత్రం ‘ఫగ్లీ’. అది 2014లో విడుదలయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల.. నాలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయిది. ‘మరో అవకాశం వస్తుందా లేక ఇక దుకాణం సర్వదేయ్యల్సిందేనా’ అనే సందేహం కూడా కలిగింది. అలా నేను తీవ్ర నిరాశలో కూరుకుపోయాను. ఆ తరువాత చాలా ఆడిషన్లకు వెళ్ళాను కానీ .. అవకాశం రాలేదు. చివరికి ‘ధోనీ’ సినిమా అవకాశం దక్కింది. దాంతో నా కెరీర్ యూ టర్న్ తీసుకున్నట్టు అయ్యింది. ప్రస్తుతం నా కెరీర్ అద్భుతంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.