Kiara Advani: కియారా అద్వానీ ఇబ్బంది పడిన సంఘటన ఇదే!

  • August 26, 2022 / 01:52 PM IST

తెలుగులో రెండు సినిమాల్లోనే నటించినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలలో కియారా అద్వానీ నటించగా ఈ రెండు సినిమాలలో భరత్ అనే నేను సక్సెస్ సాధిస్తే వినయ విధేయ రామ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. తాజాగా కియారా అద్వానీ ఒక సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. బాల్యం నుంచి నాకు నటిని కావాలనే కోరిక ఉండేదని ఆమె వెల్లడించారు.

ఇదే విషయం మా దగ్గరి బంధువు అయిన జూహి చావ్లాకు తెలిసిందని ఆమె చెప్పుకొచ్చారు. జూహీ చావ్లా నన్ను నటిని చేయాలని అనుకుంటున్న సమయంలో ఐ యామ్ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందని కియారా అద్వానీ తెలిపారు. ఆ సమయంలో జూహి చావ్లా ఇండస్ట్రీ వాళ్ల కోసం పార్టీని ఏర్పాటు చేశారని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. ఆ పార్టీకి హీరోయిన్లతో పాటు దర్శకనిర్మాతలు కూడా హాజరయ్యారని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో జుహీ చావ్లా నన్ను డైరెక్టర్ సుజాయ్ ఘోష్ కు పరిచయం చేశారని కియారా అద్వానీ వెల్లడించారు. ఆ తర్వాత సుజాయ్ ఘోష్ నాతో మాట్లాడుతూ చేయి పైకెత్తి ఎవరినో పిలవబోయారని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. ఆయన చేయి పైకెత్తడం అర్థం చేసుకోని నేను ఆయనను వెంటనే హగ్ చేసుకున్నానని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు.

నేను డైరెక్టర్ ను హగ్ చేసుకోవడంతో అక్కడే ఉన్న జూహీ చావ్లా షాకయ్యారని కియారా అద్వానీ కామెంట్లు చేశారు. కియారా అద్వానీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీలో ప్రస్తుతం కియారా అద్వానీ హీరోయిన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కియారా అద్వానీ ఖాతాలో సక్సెస్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus