Kiara Advani: పెళ్లిలో కియార ధరించిన లెహంగా ప్రత్యేకత ఏమిటో తెలుసా?
February 25, 2023 / 09:12 AM IST
|Follow Us
బాలీవుడ్ నటి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మలోత్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు. అయితే ఈ జంట తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఈ నెల 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహానికి భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు సమాచారం. అది కొద్ది మంది సన్నిహితులు బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
ఇకపోతే కియారా అద్వానీ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె గోల్డ్ కలర్ లెహంగా ధరించి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలలో సిద్ధార్థ్ మలోత్రా కూడా బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్ ఫిట్ లో ఉన్నారు. ఇక ఈ ఫోటోలు కియారా ధరించిన ఈ లెహంగా గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ లెహంగాను బంగారం వెండితో స్పెషల్ గా డిజైన్ చేశారట.
ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ లెహంగాను డిజైన్ చేశారని తెలిపారు. ఈ లెహంగా కోసం 98 వేలకు పైగా క్రిస్టల్స్ వినియోగించారట. దీని తయారీ కోసం 4 వేల గంటల సమయం పట్టిందట. కియారా ధరించిన ఈ లెహంగా కోసం దాదాపుగా 150 రోజుల పాటు శ్రమించారట. ఇక ఈ ఫోటోలలో సిద్ధార్థ మల్హోత్రా ధరించిన బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్ ఫిట్ కూడా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారని వెల్లడించారు.
ఇక పెళ్లి కోసం వీరు ధరించిన ఈ దుస్తులు ఖరీదు సుమారు లక్షల్లోనే విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో బిజీగా ఉన్నారు.