Jani Master Car Gift: జానీ మాస్టర్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన కిచ్చా సుధీప్..!

  • March 28, 2022 / 06:06 PM IST

టాలీవుడ్‌ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌లో జానీ మాస్ట‌ర్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతుంది. జానీ మాస్టర్‌ ఓ పాటకి కంపోజ్ చేసాడు అంటే అందులో అదిరిపోయే డ్యాన్స్‌ మూమెంట్స్ ఉంటాయి అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ పాట ఈయన ఇమేజ్ ను డబుల్ చేసిందని చెప్పాలి.ఆ పాటలోని డ్యాన్స్ అంత బాగా కుదిరింది. దాంతో జానీకి తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోని సినిమాలకి పనిచేసే అవకాశాలు లభిస్తున్నాయి.

Click Here To Watch NOW

ఈ మధ్య కాలంలో ‘బీస్ట్‌’ నుండీ విడుదలైన ‘అరబిక్ కుతు…’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. లిరికల్ సాంగ్ అయినప్పటికీ అందులో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ ను చూపించారు. దీనికి కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం జరిగింది.ఫుల్ లెంగ్త్ సాంగ్ లో డ్యాన్స్ ఇంకా బాగుంటుంది అని తెలుస్తుంది. మరోపక్క జానీ మాస్టర్‌ కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌తో కూడా పనిచేస్తున్నారు.జానీ పనితనానికి ఫిదా అయిపోయిన సుధీప్ ఓ కాస్ట్లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చి అతన్ని సర్ప్రైజ్ చేసాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ సందర్భంగా అతను హీరో సుదీప్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక థార్‌ మోడల్ అని.. దీని ధర దాదాపు రూ. 12 లక్షల నుండీ 14 లక్షలు ఉంటుందని తెలుస్తుంది.’విక్రాంత్ రోణ’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో సుధీప్ హీరో కాగా.. ఈ మూవీలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ తో సుధీప్ కు ఉండే ఓ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus