Kiran Abbavaram: ఒక్క ఫోటోతో ఎంత మార్పు.. ఇదే కంటిన్యూ చేస్తాడా?

  • June 10, 2023 / 03:20 PM IST

కిరణ్ అబ్బవరం.. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆ మూవీ బాగా నచ్చింది. థియేటర్లో జనాలు పెద్దగా చూడలేదు కానీ ఓటీటీల్లో ఈ మూవీ బాగా పెర్ఫార్మ్ చేసింది. దీంతో కిరణ్ కి మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ ఒక్క సినిమా వల్ల కిరణ్ అబ్బవరం కి దాదాపు 10 ఆఫర్లు వచ్చాయి.

అటు తర్వాత చేసిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అందువల్ల ఇతని సినిమాకి డీసెంట్ మార్కెట్ ఏర్పడింది. రూ.5 లేదా రూ.6 కోట్లు పెట్టి కిరణ్ తో సినిమా తీసి క్యాష్ చేసుకోవచ్చు అని చాలా మంది నిర్మాతలు బయల్దేరారు. ఈ క్రమంలో వచ్చిన ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఒక్కటే కంప్లైంట్. కిరణ్ లుక్స్ కానీ పెర్ఫార్మన్స్ కానీ మార్చడం లేదు అని..!

దాదాపు సింగిల్ ఎక్స్ప్రెషన్, ఒక నవ్వుతోనే (Kiran Abbavaram) అతను 7 సినిమాలు కంప్లీట్ చేసేశాడు. ప్రస్తుతం అతను ‘రూల్స్ రంజన్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం అతను కొత్త లుక్స్ లో కనిపిస్తున్నాడు. కిరణ్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే స్టైలిష్ లుక్ లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు. మరి పెర్ఫార్మన్స్ విషయంలో కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే .. అతని ఇమేజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus