తారక్ పై సంచలన కామెంట్స్ చేసిన కోన వెంకట్..!

  • January 12, 2019 / 12:21 PM IST

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో రాంచరణ్ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తున్నాడు. ఇక తారక్ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు నందమూరి ఫ్యామిలీ లో కూడా ఏకైక స్టార్ హీరో కావడంతో.. జూ.ఎన్టీఆర్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత అయిన కోన వెంకట్ అభిమానులతో ట్విటర్‌లో కాసేపు ముచ్చటించారు.

ఇక ఈ సందర్భంలో… కొందరు అభిమానులు తారక్ గురించి కోన వెంకట్ ని.. అడుగగా వాటికి ఆసక్తికర సమాధానాలిచ్చారు. కోనా వెంకట్ కి జూ.ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. ఒకానొక టైములో కోన వెంకట్ ని తారక్ దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ క్రమంలో ‘తారక్ అన్న గురించి ఒక మాట చెప్పండి’ అంటూ కోన ని ఓ వ్యక్తి అడుగగా.. ‘ఎంత చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఇదే ప్రశ్న మరొక వ్యక్తి అడుగగా.. ‘ప్రతివాడి జీవితంలో ఉండవలిసిన ఒక స్నేహితుడు’ అంటూ జవాబిచ్చాడు. ఇక మరో ప్రశ్నగా ‘అదుర్స్ 2 చేయండి సార్’ అంటూ ఓ నెటిజెన్ అడుగగా.. “స్క్రిప్ట్ అయితే రెడీ అయ్యింది” అంటూ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. దీంతో అభిమానులందరికీ ఆసక్తి నెలకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus