నా కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయకపోతే మీకే ప్రోబ్లమ్!

  • August 27, 2018 / 11:22 AM IST

“అప్పుడేమో ఎప్పుడు చూడు అలాంటి సినిమాలే తీస్తున్నాడు అని తిట్టారు, ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రయత్నిద్దామంటే చాలా సింపుల్ గా కొట్టిపడేస్తున్నారు. రివ్యూలతో ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ సినిమాని పాడుచేయకూడదు అంటూ రివ్యూ రైటర్లకు చిన్న క్లాస్ పీకాడు రైటర్ కమ్ దర్శకత్వ పర్యవేక్షకుడు కోన వెంకట్. ఆయన నిర్మాణ మరియు రచనా సారధ్యంలో రూపొందిన కొత్త సినిమా “నీవెవరో”. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం గత  శుక్రవారం విడుదలై.. చాలా మిశ్రమ స్పందన అందుకొంది. అందుకే ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం నిర్వహించిన సక్సెస్ మీట్ లో కోన వెంకట్ మాట్లాడుతూ.. “మా టీమ్ అంద‌రం క‌లిసి ఓ సైన్యంలా ప‌నిచేశాం. ఓ సినిమా న‌మ్మ‌కంతోనే మొద‌లై.. న‌మ్మ‌కంతోనే ఎండ్ అవుతుంది. న‌మ్మ‌కం దేవుడితో స‌మానం. సినిమాను తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు..  అంద‌రికీ జాబ్ శాటిస్‌ఫాక్ష‌న్ ఇచ్చిన సినిమా. మా టార్గెట్ రీచ్ అయ్యామ‌ని అనుకుంటున్నాం. జేబు శాటిస్‌ఫాక్ష‌న్ ఇంకా రాలేదు. ఆడియెన్స్‌కు సినిమా రీచ్ అవుతుంది. మా న‌మ్మ‌కాన్ని అంద‌రూ న‌మ్మాల‌ని లేదు. అయితే అంద‌రూ న‌మ్మే వ‌ర‌కు మంచి సినిమాలు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతూనే ఉంటుంది.

కొత్త ప్ర‌య‌త్నాలు వ‌ల్ల కొత్త  ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు. ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌గారు ఏడాదికి వంద‌కోట్ల ట‌ర్న్ ఓవ‌ర్ ఉంటుంది. అలాంటి వ్య‌క్తి.. కొత్త సినిమాలు చేయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాం. వెంకీ నుండి బాద్‌షా వ‌ర‌కు సినిమాలు చేసి స‌క్సెస్ అయినా కూడా… హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు అని తిట్టారు. రూట్ మార్చి ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్ పెట్టి 2014 నుండి కొత్త జ‌ర్నీ స్టార్ట్ చేశాం. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాల‌ని ప్రారంభించిన మా జ‌ర్నీలో మేం చేసిన నిన్నుకోరి.. ఈవాళ చేసిన నీవెవ‌రో సినిమాలు వ‌చ్చాయి. ఎంక‌రేజ్ మెంట్ అంద‌రికీ చాలా ముఖ్యం. ఈ సినిమా కోసం ఎవ‌రు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. కొన్ని వంద‌లు మంది .. వేల గంట‌లు ప‌నిచేస్తే..  ఓ సినిమా వ‌స్తుంది. అలాంటి సినిమాను ఓ ప‌ది రూపాయ‌ల పెన్‌తో కొట్టి ప‌డేయ‌డం స‌రికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేద‌న‌. ఆడియెన్స్ కోస‌మే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు. సినిమా జ‌ర్నీలో చాలా ఎమోష‌న్స్ మిళిత‌మై ఉంటాయి. కొత్త ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నం మాది. మా టార్గెట్‌ని వంద‌కు వెయ్యి శాతం పూర్తి చేశాం” అంటూ రివ్యూ రైటర్స్ కి చిన్న చురక ఇవ్వడానికి ప్రయత్నించి మళ్ళీ చివర్లో “మళ్ళీ నా మాటలు హైలైట్ చేయకండి” అని వివరణ ఇవ్వడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus