కొరటాల శివ అయిదో సినిమా ఫిక్స్!

  • June 15, 2016 / 12:54 PM IST

“మిర్చి, శ్రీమంతుడు” వంటి వరుస హిట్లతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ.. ప్రస్తుతం ఎన్టీయార్ హీరోగా “జనతా గ్యారేజ్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు మోహల్ లాల్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని సారధి స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.

నేడు (జూన్ 15) కొరటాల పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అయిదో సినిమాను ఎనౌన్స్ చేశారు. సీనియర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. “జనతా గ్యారేజ్” అనంతరం డివివి దానయ్య దర్శకత్వంలో ఓ సినిమా హ్కేసేందుకు ఇప్పటికే అంగీకరించగా.. ఇంకా మూడో సినిమా షూటింగ్ లో ఉండగానే అయిదో సినిమా ఎనౌన్స్ అవ్వడంతో.. కొరటాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus