Koratala Siva: ట్యాక్స్ పేయర్లకి ఈ దేశంలో ఏమీ చేయలేమా.. కొరటాల కామెంట్స్ వైరల్!
August 17, 2024 / 07:28 AM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ (Koratala Siva) ఒక్కో సినిమాకు 25 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మిర్చి (Mirchi) , భరత్ అనే నేను (Bharat Ane Nenu) , శ్రీమంతుడు (Srimanthudu) , జనతా గ్యారేజ్ (Janatha Garage) , ఆచార్య (Acharya) సినిమాలతో దర్శకునిగా గుర్తింపును సొంతం చేసుకున్న కొరటాల శివ తాజాగా ఒక సందర్భంలో ట్యాక్స్ పేయర్ల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
Koratala Siva
సాధారణంగా నేను ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం క్యూ లైన్ లోనే వెళ్తానని ఒకసారి మాత్రం హడావిడిగా చెన్నైకు వెళ్లాల్సి వచ్చిందని ఎయిర్ పోర్ట్ లో ఒక ప్రోటోకాల్ స్టాఫ్ నేను త్వరగా వెళ్లడానికి సహాయం చేయడంతో క్యూ లైన్ లో ఉన్న ఒక వ్యక్తి “ఏంటి కొరటాల శివ అయితే గొప్పా ఏంటి” అని అరిచేశారని ఆయన పేర్కొన్నారు. నేను ఎప్పుడూ అలా వెళ్లను కానీ ఆరోజు వెళ్లాల్సి వచ్చిందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో నాకు కోపం వచ్చేసిందని నాపై అరిచిన వ్యక్తితో నేను సంవత్సరానికి 4 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను కడుతున్నానని ట్యాక్స్ కడుతున్న నాకు ప్రత్యేక సౌలభ్యం ఇవ్వండి అని కామెంట్ చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రివిలేజ్ ను అప్పుడప్పుడు అయినా ఎంజాయ్ చేయనివ్వండి అని నేను కామెంట్ చేశానని కొరటాల శివ అన్నారు. ఆ సమయంలో కొంతమంది క్లాప్స్ కొట్టారని కొరటాల శివ తెలిపారు.
ఎయిర్ పోర్టులలో, తిరుమలకు వెళ్లిన సమయంలో ప్రత్యేక క్యూ లైన్ పెట్టొచ్చుగా అని ఒక ఆదాయపు పన్ను శాఖ అధికారిని అడిగానని కొరటాల శివ తెలిపారు. ట్యాక్స్ పేయర్లకు ప్రత్యేక లైన్ పెడితే ట్యాక్స్ చెల్లించని వాళ్లు సైతం ఏదో ఒకరోజు ఈ లైన్ లో ఉండాలని ఫీలవుతారని కొరటాల శివ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్లకి ఈ దేశంలో ఏమీ చేయలేమా అంటూ ఆయన ప్రశ్నించారు. కొరటాల శివ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.