కొరటాల కలెక్షన్ మొదలు పెట్టాడు…!!

  • November 12, 2016 / 09:43 AM IST

సినిమాపై ప్రేమ…సినిమా అంటే పిచ్చి…..సినిమా అంటే ఫ్యాషన్ అని మొదలు పెడతారు సినిమా పరిశ్రమలో మొదలుపెడతారు అందరూ…అయితే కాస్త హిట్ రుచి చూసిన తర్వాత అనుకోకుండా ఆలోచనలన్నీ మనీ వైపు తిరుగుతాయి. ఆవిషయం కాస్త పక్కన పెడితే…తాజాగా రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యీ…దర్శకుడిగా మారి బడా హీరోలకు భారీ హిట్స్ ను అందించిన దర్శకుడు కొరటాల. అదే క్రమంలో ఆయన తీసిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు అయితే ఆహీరోల కరియర్ లోనే కాదు…ఇండస్ట్రీలోనే పెద్ద హిట్స్ గా నిలిచాయి. అయితే అంతటి స్టామినా ఉన్న కొరటాల ఇప్పుడు కోట్లపై కన్నేసాడు…విషయం ఏమిటంటే….ప్రస్తుతం కొరటాల ప్రిన్స్ మహేష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే…అదే క్రమంలో తన పారితోషికం పెంచుకునేందుకు కొరటాల ఒక భారీ స్కెచ్ వేశాడు అనే వాదన టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.

విషయంలోకి వెళితే….మహేష్ తో సినిమా కోసం 13  కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న కొరటాల శివ.. ఆ అమౌంట్ తో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే తనకు అమౌంట్ కు బదులుగా ఓవర్సీస్ హక్కులు ఇచ్చేయమని అడుగుతున్నాడట. ఓవర్సీస్ లో సూపర్ స్టార్ సినిమాలు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వసూళ్లు సాధిస్తుంటాయి. మహేష్-కొరటాల మూవీ అంటే కనీసం 15 కోట్లు అయినా వచ్చేయడం ఖాయం. అందుకే 15 కోట్లకు మించి షేర్ వస్తే కనుక ఫిఫ్టీ ఫిప్టీ చేసుకుందామని నిర్మాతలకు ఆఫర్ ఇచ్చాడట కొరటాల. ఈ విషయం తెలియగానే షాక్ తిన్న నిర్మాతలు ఏం చెప్పాలో ఆర్డమ్ కాక కాస్త టైమ్ అడిగినట్లు సమాచారం….అంటే మరి….దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలిగా…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus