Koratala Siva: మెగాస్టార్ సినిమాతో కొరటాలకి ఇబ్బందులు తప్పవా..?
May 15, 2021 / 11:53 AM IST
|Follow Us
దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. చాలా కాలంగా ఈ సినిమా మేకింగ్ దశలోనే ఉంది. ఇప్పుడు కరోనా రెండో దశ కారణంగా ‘ఆచార్య’ సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ సినిమాకి నిర్మాతగా నిరంజన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణ అయినప్పటికీ వాళ్లు ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టడం లేదని.. చిరంజీవి, రామ్ చరణ్ రెమ్యూనరేషన్ లు మాత్రమే కొణిదెల ప్రొడక్షన్స్ చూసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పుడు సినిమా రిస్క్ మొత్తం దర్శకుడు కొరటాల శివపై పడిందని తెలుస్తోంది.
కొరటాల శివ ఆయన చేసే సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్ మొత్తం ఆయనే చూసుకుంటారు. ఆయనకు సెపరేట్ డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ఉంది. వారికి మాత్రమే తన సినిమాలను అమ్ముతుంటారు. రేట్లు కూడా కొరటాలే నిర్ణయిస్తాడు. గతంలో చాలా సినిమాలకు ఇలానే చేశారు. ‘భరత్ అనే నేను’ సినిమా విడుదల సమయంలో అయితే నిర్మాత దానయ్యతో లాభ నష్టాల విషయంలో కొన్ని ఇష్యూలు వచ్చాయి. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా మార్కెటింగ్ కూడా కొరటాలే చూసుకుంటున్నారు.
రీసెంట్ గా.. నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఐదు కోట్లకు కాస్త అటు ఇటుగా తనకు లాభం ఇచ్చేలా.. సినిమా మొత్తం కొరటాల శివకు వదిలేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అలా సినిమాని కొరటాల చేతుల్లో పెట్టిన తరువాత కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఇప్పుడు సినిమా ఫైనాన్స్ వడ్డీలన్నీ కొరటాల మీదే పడతాయనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే కొరటాలకి ఈ సినిమాతో ఇబ్బందులు తప్పవనే చెప్పాలి!