NTR: ఎన్టీఆర్‌ – కొరటాల సినిమాపై ఫుల్ క్లారిటీ ఇస్తే పోయేదిగా

  • April 12, 2021 / 09:42 PM IST

సోషల్‌ మీడియాని, సినిమా వార్తా ప్రపంచాన్ని రెండు రోజులుగా హీట్ ఎక్కిస్తున్న విషయం #ఎన్టీఆర్30. త్రివిక్రమ్‌తో రావాల్సిన ఈ సినిమా రద్దు అయ్యిందని, మరో దర్శకుడితో సినిమా వస్తుందని పుకార్లు, లీకులు, వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆఖరిగా ఆ దర్శకుడు కొరటాల శివ అని అనధికారిక క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు అధికారిక సమాచారం కూడా వచ్చేసింది. అయితే ఈ విషయం చెబుతూ… ఓ చిన్న ట్విస్ట్‌ కూడా ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చ దీని గురించే.

Last time repairs were local…but for a change we will cross boundaries this time. ఇదీ ట్వీట్‌లో కొరటాల రాసుకొచ్చిన లైన్. సింపుల్‌గా చూసుకుంటే… గతంలో మనం లోకల్‌గా రిపేర్లు చేశాం. ఈసారి చిన్న మార్పు మన రిపేర్లు సరిహద్దులు దాటుతాయి అని రాసుకొచ్చాడు. ఈ మాటలు వింటే ‘జనతా గ్యారేజ్‌’ డైలాగ్‌ని మార్చి చెప్పాడని మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ లోకల్‌, బౌండరీలు దాటడం ఏంటి? అనేది. ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయనేది అభిమానుల మాట.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ఎన్టీఆర్‌ నుండి అభిమానులు కూడా అదే ఆశిస్తున్నారు. దీంతో కొరటాల సినిమా పాన్‌ ఇండియా మూవీనా అనే మాట వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్‌’ డైలాగ్‌ను వాడి చెప్పాడు కాబట్టి… ఇదేమేనా ‘జనతా గ్యారేజ్‌’కి రీమేకా అనేది తెలియడం లేదు. లేదంటే అలాంటి కథ అయ్యే అవకాశమూ ఉంది. అందుకే ఈ ట్వీట్‌లో ఓ క్లారిటీ ఇచ్చేసి ఉంటే బాగుండేదేమో కొరటాల గారు. అన్నట్లు ఈ సినిమా డేట్‌ కూడా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో చెప్పేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న ఈ సినిమా వస్తుందట.


Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus