మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు అన్ లాక్ లో భాగంగా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా.. ‘ఆచార్య’ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. చిరు ఓకే అంటే.. షూటింగ్ కు రెడీ అవ్వాలని కొరటాల ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉందని సమాచారం.
రామ్ చరణ్ ఎపిసోడ్ కి సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదట.ఆ సన్నివేశాలకు కొరటాల ఇప్పటికీ ఫైన్ ట్యూన్ ఇస్తూనే ఉన్నాడని టాక్. నిజానికి కొరటాల తన సినిమాల్లో సన్నివేశాలను నచ్చే వరకు రాస్తూనే ఉంటారు. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి చాలా కీలకమైంది. అందుకే ఈ సన్నివేశాలపై కొరటాల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. నిజానికి చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను రాసుకున్నప్పటికీ.. వాటికి మరింత మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
స్క్రిప్ట్ ని మరింత పకడ్బందీగా సిద్ధం చేయడానికి కావాల్సినంత సమయం దొరకడంతో.. కొరటాల స్క్రిప్ట్ ని తిరిగి రాసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటివరకు కొరటాల తన సినిమాల విషయంలో మరో రచయిత సహాయం తీసుకోలేదు కానీ మొదటిసారిగా శ్రీధర్ సీపాన సాయం తీసుకుంటున్నారు. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లకు మాట సాయం ఆయనే చేస్తున్నారట. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కు చిరు రెడీ అయ్యేలోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?