నేచురల్ స్టార్ తో కొరటాల తదుపరి చిత్రమ్.!

  • May 14, 2018 / 09:17 AM IST

“మగధీర” లాంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం రాజమౌళి కోసం ఇండస్ట్రీలోని బడా హీరోలందరూ వెయిట్ చేస్తుంటే.. రాజమౌళి మాత్రం సైలెంట్ గా నానితో “ఈగ” మొదలెట్టాడు. ఆ సినిమా కూడా దాదాపుగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడు. అందుకే, మహేష్ బాబుతో “భరత్ అనే నేను” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం అల్లు అర్జున్, అఖిల్ లాంటి హీరోలందరూ కొరటాల కోసం వెయిట్ చేస్తుంటే.. కొరటాల మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నాని హీరోగా ఒక సినిమా మొదలెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడట.

నిజానికి “భరత్ అనే నేను” అనంతరం కొరటాల స్టార్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరితో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ.. నానితో ఒక కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న కొరటాల ఆ ట్రిప్ నుంచి రిటర్న్ అవ్వగానే నాని సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలెడతాడట. నాని సినిమా తర్వాత మిగతా సినిమాల విషయాలను ఆలోచిస్తాడట కొరటాల.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus