Koratala Siva: ట్విటర్ నుండి వెళ్లిపోవడంపై కొరటాల క్లారిటీ!
April 19, 2022 / 11:48 AM IST
|Follow Us
ట్విటర్ నుండి కొరటాల శివ వెళ్లిపోయారు… ఆ మధ్య ఈ వార్త చాలా వైరల్ అయ్యింది. అయితే ఆయన ఎందుకు ట్విటర్ నుండి బయటకు వెళ్లిపోయారు. అంతలా ఏం జరిగింది అంటూ లెక్కలేసుకోవడం మొదలెట్టారు అభిమానులు, నెటిజన్లు. ట్రోలింగ్ వస్తుందనా? వచ్చిందనా? ఇంకేమైనా కారణం ఉందా? అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకున్నారు. తాజాగా కొరటాల ఈ విషయమై స్పందించారు. తానెందుకు ట్విటర్ నుండి బయటకు వచ్చేసింది చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో మొదట్నుంచీ కొరటాల అంత యాక్టివ్‌గా ఉండేవారు కాదు. సోషల్ మీడియాను ఎక్స్ట్రా బ్యాగేజీ అనుకునేవారాయన. ఈ క్రమంలోనే ట్విటర్ నుండి బయటికి వెళ్లిపోయారట. అయితే ఇలా ట్విటర్ ఖాతా క్లోజ్ చేయడం వెనుక ఎవరెవరో ఏదో అనుకుంటున్నట్లు కారణాలేవీ లేవు అని చెప్పారు. సోషల్ మీడియా అనేది మనకు అందుబాటులో ఉన్న గొప్ప వేదిక అని చెప్పారు కొరటాల. అయితే ఇలాంటి వేదికల్లో మంచితోపాటు చెడు కూడా ఉంటుంది.
అలాంటి చెడుని ఎంత తగ్గించుకుంటు అంత మంచిది అని ఆయన అభిప్రాయమట. సోషల్ మీడియా దాకా వచ్చామంటే మనమంతా ఎంతో కొంత చదువుకునే ఉంటాం. నలుగురితో ఎలా వ్యవరించాలో తెలిసే ఉంటుంది. అందుకు తగ్గట్టే మసలుకోవాలి అని చెప్పారు కొరటాల. జీవితంలో ఫన్ ఉండాలి కానీ ద్వేషం, ప్రతికూల ఆలోచనలు అనవసరం అని చెప్పార కొరటాల. ఏ కారణం లేకుండా ట్విటర్ అకౌంట్ క్లోజ్ చేశాను అని చెప్పిన కొరటాల ఆఖరి మాటలతో డౌట్స్ పెంచారు.
ద్వేషం, ప్రతికూల ఆలోచనలు వద్దు అని ఆయన చెప్పడం వెనుక సోషల్ మీడియాలో ఆయన ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారు, లేదంటే చూశారు అనేది తెలుస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. అయితే ఏ విషయంలో, ఎవరి విషయంలో ఆయన ఇబ్బంది పడ్డారు అనేది తెలియడం లేదు. ట్రోలింగ్, కామెంట్స్ విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. చర్చ పీక్స్‌లో ఉన్నప్పుడు సోషల్ మీడియా నుండి బయటకు వచ్చేసిన కొరటాల.. ఇప్పుడు ఈ కామెంట్స్‌తో మరోసారి చర్చనీయాంశంగా మారారు అని చెప్పొచ్చు.