చిరంజీవి ఎవరికైనా రూపాయి సాయం చేశారా..?

  • May 8, 2022 / 11:33 PM IST

మెగాఫ్యామిలీ అంటే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకి అసలు పడడం లేదు. ఆ ఫ్యామిలీపై, కుటుంబ సభ్యులపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. కొన్ని నెలల క్రితం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల సమయంలో నాగబాబుని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోటా. చిరంజీవిని కూడా కొన్ని విషయాల్లో తప్పుబట్టారు. ఇప్పుడు ఆయన చిరంజీవి మీద ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘మే డే’ ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్ పై కోటా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నట్లు చిరు చెప్పిన మంచి విషయం మీద స్పందించిన కోటా.. ముందు కార్మికులకు తిండి పెట్టాలని.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారని కోట ప్రశ్నించారు. ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

మే డే వేడుకల్లో భాగంగా తాను సినీ కళాకారుడిని కాదని, కార్మికుడినని చిరు వ్యాఖ్యానించడాన్ని కోట తప్పుబట్టారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ప్రశ్నించారు కోటా. తనకు అలాంటి మాటలు నచ్చవని.. కానీ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని చెప్పారు. చిరంజీవి సేవా భావంపై కూడా కౌంటర్లు వేశారు కోటా.

చిరంజీవి ఎవరికైనా ఏనాడైనా రూపాయి సాయం చేశారా … ఆయన సినిమాల్లో ఎవరికైనా వేషాలు ఇప్పించారా అని ప్రశ్నించారు. సాయం కోరి తన ఇంటి దగ్గరకు వచ్చేవారికి డబ్బులిచ్చి పంపిస్తుంటానని.. ఇలా ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కోసం రూ.5 లక్షల దాకా సాయం చేశానని.. అంతే కానీ నేను ఇది చేస్తా, అది చేస్తానని చెప్పనని కోట వ్యాఖ్యానించారు. షుగర్ పేషెంటైన తాను తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం వృద్ధాప్యంలోనూ నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus