మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరి మధ్య వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లింది. ఇండస్ట్రీలో కొందరు మంచు విష్ణుని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మెగాఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే ఉందంటూ ఇటీవల నాగబాబు స్పష్టం చేశారు. ఈ నెల 10న జరగనున్న ఈ ఎన్నికలతో ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పడనుంది.
ఈలోగానే ఎవరు ఎవరిపై ఎన్ని ఆరోపణలు చేసుకోవాలో.. పోటీ పెట్టుకున్నట్లుగా చేస్తున్నారు. మంచు విష్ణు కోసం మోహన్ బాబు రంగంలోకి దిగి.. ఇండస్ట్రీ పెద్దల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజులను కలిశారు మోహన్ బాబు. మంచు విష్ణు కూడా వారిని కలిసి మద్దతులు తీసుకున్నారు.తాజాగా కోటా శ్రీనివాసరావుని కూడా రంగంలోకి దించారు. ఆయనతో ‘మా’ ఎన్నికల గురించి మాట్లాడించారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముందుగా మంచు విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ప్రకాష్ రాజ్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు.
మంచు విష్ణు పోటీలో ఉన్నాడు.. ఓట్లు వేయమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆయన సమర్థుడని.. అందరూ ఓట్లు వేసి, గెలిపిస్తారని అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ నటన గురించి మాట్లాడనని.. అయితే ఆయనలా అవార్డులు తెచ్చామని చెప్పుకోమని వ్యంగ్యంగా అన్నారు. ప్రకాష్ రాజ్ తో దాదాపు పదిహేను సినిమాలు చేసి ఉంటానని.. ఏ ఒక్కరోజూ కూడా షూటింగ్ కి టైమ్ కి రాలేదని.. అతడి ప్రవర్తన గురించి చెప్పుకొచ్చారు. విష్ణుకి సపోర్ట్ చేయమని కోరారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు