Kovai Sarala: వామ్మో.. కోవై సరళ అన్ని సినిమాల్లో నటించారా..?
April 7, 2021 / 07:01 PM IST
|Follow Us
తెలుగు, తమిళ భాషల్లో కామెడీ రోల్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కోవై సరళ ఈరోజు 58వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1962 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కోవై సరళ జన్మించారు. ఎంజీఆర్ సినిమాలను చూసి సినిమాల్లో నటించాలని భావించిన కోవై సరళ చిన్న వయస్సులోనే తమిళ సినిమాలతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కొన్నేళ్లకే గర్భిణిగా, ముసలావిడగా వయస్సుకు మించిన పాత్రల్లో సైతం నటించి కోవై సరళ తన నటనతో మెప్పించారు.
తెలుగులో బ్రహ్మానందం, కోవై సరళ జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ హాస్యనటి పురస్కారాలను కోవై సరళ మూడుసార్లు అందుకోవడం గమనార్హం. ఉమ్మఢి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తమ హాస్యనటిగా కోవై సరళ నంది పురస్కారం అందుకున్నారు. తండ్రి, సోదరి ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కోవై సరళ పెళ్లి చేసుకోలేదు. కోవై సరళ ప్రస్తుతం తమిళంలోని పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కోవై సరళ ఇంటికి పెద్ద కూతురు కాగా ఆమెకు నలుగురు చెల్లెళ్లు ఉన్నారు.
చెల్లెళ్ల విద్య, వివాహాలకు ప్రాధాన్యతనిచ్చి కోవై సరళ పెళ్లికి దూరంగా ఉన్నారని సమాచారం. కోవై సరళ ఒంటరి జీవితాన్ని ఇష్టపడతారని తెలుస్తోంది. కోవై సరళ తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 750 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం “కామెడిల కలవకుత్తు ఎప్పాడి “అనే షోకు కోవై సరళ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తమిళంలోని విజయ్ టీవీ ఛానల్ లో ఈ కామెడీ షో ప్రసారమవుతోంది..