టాలీవుడ్ ట్యాలెంటెడ్ దర్శకుల్లో జాగర్ల మూడి క్రిష్ ఒకడు….అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అయితే అదే క్రమంలో సక్సెస్ రేట్ విషయంలో కాస్త వెనుక బడ్డాడు క్రిష్. ఇదిలా ఉంటే క్రిష్ తీసినవి కేవలం కొన్ని సినిమాలే అయినా…టాలీవుడ్ లెజెండ్, లయన్ అయినటువంటి నందమూరి బాలయ్య 100వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కొట్టేసాడు…..అంతేకాకుండా ఆ సినిమాతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు..ఇదిలా ఉంటే తన కధల గురించి….తన కధల పుట్టుక గురించి క్రిష్ ఏమంటున్నాడు అంటే…నా కధ ఇలా పుడుతుంది అని అంటున్నాడు క్రిష్…ఏ కధ ఎలా పుట్టిందో చెప్పే క్రమంలో తన సినిమాల కధల గురించి క్రిష్ మాటల్లో విందాం రండి….అసలు గమ్యం కధ ఎలా పుట్టింది అంటే….అప్పటి ప్రభుత్వం-నక్సల్స్ మధ్య చర్చలు తనకు స్పూర్తిని ఇచ్చాయట. అయితే ఆ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది అన్నది ఆలోచించలేదు.
అప్పటికి ఆ కథ చెప్పాలని బలంగా కోరుకున్నాను. సినిమా తీశాను అంటున్నాడు క్రిష్…ఇక అదే క్రమంలో ‘వేదం’ కథకు ముంబయి దాడులు కథా వస్తువు అయ్యాయి. ఉగ్రవాదులు ఆసుపత్రి మీద దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాను. మన చుట్టూ ఉండే మనుషుల్లోంచి పాత్రలు తీసుకున్నాను అంటున్నాడు క్రిష్. ఇక అదే క్రమంలో ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాకు సురభి నాటకాలే స్ఫూర్తి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు సురభి వాళ్లకు స్థలం కేటాయించారు. ఆ చిన్న ఉదాహరణే కధగా తయారయ్యేందుకు ఊపిరి పోసిందట. ఇక కంచే విషయానికి వస్తే కంచె సినిమాకు రాష్ట్ర విభజన నేపథ్యమైంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. మనుషులుగా కలిసుండాలనే నేపథ్యంలో ఈ కధ రాసుకున్నట్లు తెలిపాడు……ఇక సరికొత్త చరిత్రకు కారణం అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి కోటి లింగాల దగ్గర నాణేల ప్రదర్శన ఊపిరి పోసిందట….ఇలా తన కధలను, సినిమాలను గూర్చి క్రిష్ తన మనసులోనూ మాటను మీడియాకు పంచుకున్నాడు….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.