స్టార్ హీరోయిన్ కోసం క్రిష్ ప్రయత్నాలు!

  • February 4, 2021 / 01:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలు అంగీకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ సినిమాతో పాటు ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. రీసెంట్ గా క్రిష్ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ లో పాల్గొన్నాడు పవన్. తదుపరి షెడ్యూల్స్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకోగా.. నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా చోటు ఉందని తెలుస్తోంది. దానికోసం స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్న ఓ హీరోయిన్ తో సంప్రదింపులు జరిపాడట. అలానే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోయిన్ తో కూడా ఈ పాత్రకు సంబంధించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ లతో పాటు సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట.

చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా విరూపాక్ష లేదా వీరమల్లు అనే పేర్లు పెట్టే ఛాన్స్ ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘హరహర మహాదేవ’ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ పవన్ సినిమా కోసమనే ప్రచారం సాగుతోంది. భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus