క్రిష్ చేయనున్న మరో రెండు భారీ ప్రాజక్ట్స్ ఇవే

  • February 14, 2017 / 06:58 AM IST

గమ్యం, వేదం మూవీలతో తనకంటూ ఓ గుర్తింపును సాధించుకున్న డైరక్టర్ క్రిష్ కంచె సినిమాతో పాపులర్ అయ్యారు. ఇప్పుడు నటసింహ బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను అత్యంత వేగంగా అద్భుతంగా తెరకెక్కించి టాలీవుడ్ లో టాప్ డైరక్టర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. మరుగున పడిపోయిన  ఒకటవ శతాబ్దం కాలం నాటి చరిత్రను వెండితెరపైనే ఆవిష్కరించిన ఈ డైరక్టర్ కి ఈ చిత్ర విజయం మంచి ఉత్సాహాన్ని అందించింది. అందుకే అయన మరో రెండు చారిత్రాత్మక గాథలను సినిమాగా మలచాలని భావిస్తున్నారు. ఈ విషయాన్నీ క్రిష్ నిన్న మీడియా ప్రతినిధులకు చెప్పారు.

” గౌతమి పుత్ర శాతకర్ణి విజయం నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అందుకే తెలుగు చక్రవర్తి  శ్రీకృష్ణదేవరాయలు, శాంతి ప్రజ్వలిల్లాలని కోరుకున్న మహానుభావుడు గౌతమ బుద్ధుడు చరిత్రపై సినిమాలు తీయాలని భావిస్తున్నాను” అని వివరించారు. ప్రస్తుతం క్రిష్ విక్టరీ వెంకటేష్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus