క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎన్నో గుర్తుంది పోయే సినిమాలు తెరకెక్కించాడు. ఓ హీరో నటుడుగా ప్రూవ్ చేసుకోవాలన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర కావాలన్నా కృష్ణవంశీ డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సిందే. అయితే 2007 లో వచ్చిన ‘చందమామ’ చిత్రం తర్వాత మరో హిట్టందుకోలేదు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఇక మధ్యలో వచ్చిన ‘రాఖీ’ ‘మహాత్మ’ ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘నక్షత్రం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయనకి అవకాశాలు అస్సలు రావడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యాడు కృష్ణవంశీ.
ఇందులో భాగంగా ఎన్టీఆర్ తో ఓ మంచి రొమాంటిక్ సినిమాను తీయ్యండి సర్ అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. “మీరు కోరుకున్నట్లుగా సినిమా తీసేందుకు యువ దర్శకులు చాలా మంది ఉన్నారు. రొమాంటిక్ సినిమాలు వాళ్ళు చేస్తే బాగుంటాయి” అంటూ జవాబిచ్చాడు. గతంలో ఎన్టీఆర్ తో కృష్ణవంశీ ‘రాఖీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. వరుస ప్లాపులతో ఉన్న ఎన్టీఆర్ కు ఈ చిత్రం కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఎన్టీఆర్ నటనకు అయన ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు.