Krishnam Raju: ప్రభాస్ కు ‘బాహుబలి’ అయితే.. కృష్ణంరాజు కి ‘తాండ్ర పాపారాయుడు!

  • September 11, 2022 / 08:59 AM IST

ప్రభాస్ అప్పటి వరకూ టాలీవుడ్ లో స్టార్ హీరోగానే కొనసాగుతూ వచ్చాడు. కానీ ఒకేసారి ఇండియన్ వైడ్ స్టార్ హీరో అయ్యాడు. పాన్ ఇండియన్ స్టార్ గా అన్న మాట. ప్రభాస్ కటవుట్ ను ఇండియన్ లెవెల్లో పాపులర్ చేసిన సినిమా ‘బాహుబలి’ అని చెప్పడంలో సందేహం లేదు. అలా అని పాన్ ఇండియా సినిమాలు తీసేస్తే అన్ని భాషల్లో జనాలు చూసేస్తారు అనుకుంటే పొరపాటే..! ఆ తరువాత కూడా చాలా మంది పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.

ఒక్క ‘కె.జి.ఎఫ్’ మినహాయిస్తే ఆ స్థాయిలో మరే సినిమా సక్సెస్ కాలేదు. ఇది పక్కన పెడితే…ప్రభాస్ కు బాహుబలి ఎలాగో … అతని పెదనాన్న కృష్ణంరాజు కి తాండ్రపాపారాయుడు సినిమా అలా అని చెప్పాలి.అప్పటి రోజుల్లో ఈ చిత్రాన్ని కోటి 75 లక్షల భారీ బడ్జెట్ పెట్టి తీసారు.కేవలం వార్ సీన్స్ కు మాత్రమే 50 లక్షలు ఖర్చు చేసారట. తెలుగు సినిమా చరిత్రలో ఆరుగురు ఎం.పి లు నటించిన సినిమా ఇదే కావడం విశేషం.

వాళ్ళే కృష్ణంరాజు, జయప్రద, దాసరి, సి.నారాయణ రెడ్డి, మోహన్ బాబు, సుమలత.. వంటి ఎం.పి. లు ఈ చిత్రంలో నటించారు. 17 వ శతాబ్దంలోని బొబ్బిలి బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగుతుంది. ‘బాహుబలి’ ఓ ఫాంటసీ మూవీ అయితే… ‘తాండ్రపాపారాయుడు’ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమా. తాండ్ర పాపారాయుడు వీరమరణం ఎలా పొందాడు.. అనే పాయింట్ చాలా బాగా ఎష్టాబ్లిష్ చేసారు దాసరి. లాక్ డౌన్ వల్ల బోర్ కొడుతుంది అనుకుంటే … ఈ చిత్రం చాలా వర్తబుల్. కచ్చితంగా చూడండి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus