Krishnam Raju: ఓవర్సీస్ తెలుగు ప్రింట్స్ లో కృష్ణంరాజు మిస్సింగ్.. ఎందుకంటే?
March 11, 2022 / 10:38 PM IST
|Follow Us
ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేషన్ లో బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో బిల్లా యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా రెబల్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. రాధేశ్యామ్ సినిమాకు యావరేజ్ టాక్ రాగా ఈ సినిమా ఫుల్ రన్ లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం రాధేశ్యామ్ సినిమా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ ప్రదర్శితమైన థియేటర్లలో పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపించగా యూఎస్ లోని తెలుగు ప్రింట్స్ లో మాత్రం కృష్ణంరాజుకు బదులుగా సత్యరాజ్ కనిపించారు. యూకేకు పంపిన కొన్ని ప్రింట్లలో అసలు కృష్ణంరాజు పాత్రనే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సత్యరాజ్ కు యూఎస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉండటంతో ఆయనను అక్కడి తెలుగు ప్రింట్స్ లో చూపించి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు మాత్రం పరమహంస పాత్రకు సత్యరాజ్ కంటే కృష్ణంరాజు సరిగ్గా న్యాయం చేశారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూఎస్ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు ఎందుకు కనిపించడం లేదని ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ నుంచి ఈ ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నాలుగేళ్ల పాటు రాధేశ్యామ్ సినిమా షూటింగ్ జరుపుకోగా ఎన్నో ఆవాంతారాలను దాటుకుని ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. ప్రభాస్ కు ఈ సినిమా సక్సెస్ మార్కెట్ పరంగా ఎంతో కీలకమనే కీలకమనే సంగతి తెలిసిందే.