రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కృష్ణంరాజు ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. అయితే సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కృష్ణంరాజు ఆఖరి కోరిక ప్రభాస్ పెళ్లి అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదని సమాచారం.
ప్రభాస్ కు పెళ్లి జరగడంతో పాటు ప్రభాస్ కు పిల్లలు పుడితే ఆ పిల్లలతో కూడా కలిసి నటించాలని కృష్ణంరాజు భావించారని సమాచారం. అయితే ఆఖరి కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులతో తన ఆఖరి కోరిక గురించి కృష్ణంరాజు వెల్లడించారని తెలుస్తోంది. కృష్ణంరాజు తన సినీ కెరీర్ లో 187కు పైగా సినిమాలలో నటించారు. కృష్ణంరాజు మంచి మనిషిగా ఇండస్ట్రీలో గుర్తింపును సొంతం చేసుకున్నారు.
మంచితనానికి కృష్ణంరాజు మారుపేరని ఆయన మరణం తీవ్రంగా కలచివేసిందని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో కృష్ణంరాజు మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. పోస్ట్ కోవిడ్ సమస్యల వల్ల గతేడాది ఆయన కాలుకు సర్జరీ జరిగిందని కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బ తిందని వైద్యులు చెబుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. కృష్ణంరాజు మరణవార్త విని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కు గుర్తింపు రావడంలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. కృష్ణంరాజు మరణవార్త ప్రభాస్ కు తీరని లోటు అని చెప్పాలి. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదగడం తనకు గర్వంగా ఉందని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.