Prabhas: ప్రభాస్ కోసం ఫోన్ చేస్తూనే ఉంటారు: ప్రభాస్ పెద్దమ్మ
March 8, 2022 / 04:08 PM IST
|Follow Us
ప్రభాస్ – పూజ హెగ్డే కలిసి నటించిన రొమాంటిక్ లవ్ అడ్వెంచరస్ మూవీ రాధేశ్యామ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీగా విడుదలవుతున్న సినిమాగా రాధేశ్యామ్ మొదటి రికార్డును క్రియేట్ చేయనుంది. ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. అలాగే ఈ సినిమాను కృష్ణంరాజు హోమ్ బ్యానర్ గోపి కృష్ణ బ్యానర్ కూడా యూవీ క్రియేషన్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ప్రస్తుతం ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ తరుణంలో ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడం విశేషం. కృష్ణం రాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కు వారి పెదనాన్న అంటే చాలా ఇష్టం అని ఆయనను ప్రభాస్ ప్రేమగా బాజి అని పిలుస్తారని అన్నారు.
ఇక తనను కన్నమ్మ అని పిలుస్తారు అని తెలియజేశారు. అయితే ప్రభాస్ కు పులుస చేప అంటే చాలా ఇష్టం అని మంచి భోజన ప్రియులు అని కూడా ఆమె మరోసారి గుర్తు చేశారు. కృష్ణంరాజు సినిమాలో నటించేటప్పుడు గాయానికి గురయ్యారని ఆయన గాయంతో ఉన్నప్పటికీ కూడా సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లుగా తెలియజేశారు. ఇక ప్రభాస్ కృష్ణంరాజు ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అని ప్రభాస్ అయితే తన పేద నాన్నతో ఒక రోజులో మూడు గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు అని శ్యామలాదేవి తెలియజేశారు.
ఇక ప్రభాస్ కోసం అయితే చాలా మంది అభిమానులు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు అంటూ అందులో ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు అని కూడా ఆమె తెలియజేశారు. ఇక ప్రభాస్ మాత్రం అమ్మాయిలతో మాట్లాడేందుకు చాలా సిగ్గుపడతారని కూడా తెలియజేశారు.