Ashish Vidyarthi: ఆశిష్ విద్యార్థి పెళ్లి పై కెఆర్కే సంచలన ట్వీట్.. మండిపడుతున్న నేటిజన్స్!

  • May 26, 2023 / 06:36 PM IST

సినీనటుడిగా ఎన్నో విల్లన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేసినటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి 60 సంవత్సరాల వయసులో కలకత్తాకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ ప్రేన్యూయర్ రూపాలిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట అయితే వీరి ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ కొద్దిమంది సన్నిహితులు బంధువుల సమక్షంలో వీరిద్దరూ రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడమేంటి అంటూ పెద్ద ఎత్తున వీరి పెళ్లిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు, సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ వీరి పెళ్లి గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కెఆర్కే తరచూ ట్విట్టర్ వేదికగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి సంచలనమైన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

కొన్నిసార్లు ఈయన హద్దులు దాటి ట్వీట్స్ చేయగా ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన వ్యవహార శైలి పట్ల చర్యలు తీసుకున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈయన మాత్రం తన ధోరణి మార్చుకోలేదు.ఈ క్రమంలోనే తాజాగా ఆశిష్ విద్యార్థి పెళ్లి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంచలనమైన ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఈయన ఆశీష్ విద్యార్థి దంపతులకు ఒకవైపు శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు కొంచమైనా సిగ్గుండాలి బాయ్ సాబ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ట్వీట్ పై నేటిజన్స్ స్పందిస్తూ వాళ్ళు పెళ్లి చేసుకుంటే నీకేంటి అభ్యంతరం అంటూ ఈయన చేసిన ట్వీట్ పై స్పందిస్తూ మండిపడుతున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus