Kumari 21F Collections: ‘కుమారి 21ఎఫ్’ కి 6 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
February 5, 2022 / 05:29 PM IST
|Follow Us
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ‘సుకుమార్ రైటింగ్స్’, ‘పి.ఎ. మోషన్ పిక్చర్స్’ పతాకం పై విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి…లు దర్శకుడు సుకుమార్ తో కలిసి నిర్మించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. నోయల్, సుదర్శన్,నవీన్ నేని హేమ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే..! 2015 వ సంవత్సరం నవంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై 6ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
5.35 cr
సీడెడ్
1.42 cr
ఉత్తరాంధ్ర
1.45 cr
ఈస్ట్
0.89 cr
వెస్ట్
0.77 cr
గుంటూరు
0.86 cr
కృష్ణా
0.83 cr
నెల్లూరు
0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
11.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.82 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
13.65 cr
‘కుమారి 21ఎఫ్’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.13.65 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకి ఏకంగా రూ.8.65 కోట్ల లాభాలని అంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పొచ్చు.