Pushpa2: అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కుర్చీ తాత!

  • January 9, 2024 / 02:28 PM IST

కుర్చీ తాతగా ఎంతో ఫేమస్ అయినటువంటి షేక్ అహ్మద్ షాషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనని తన పూర్తి పేరుతో పిలిస్తే పెద్దగా గుర్తుపట్టలేరు కానీ కూర్చి మడత పెట్టి తాత అంటే మాత్రం టక్కనే గుర్తుపడతారు. ఈ ఒక్క డైలాగుతో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఈ డైలాగ్ ఫేమస్ కావడంతో ఈ డైలాగ్ తో ఏకంగా గుంటూరు కారం సినిమాలో పాటను పెట్టడంతో కుర్చీ తాత మరింత ఫేమస్ అయ్యారు.

ఇటీవల ఈ సినిమాలోని ఈ పాటను విడుదల చేయడంతో కూర్చుతాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా ఫేమస్ అవ్వడమే కాకుండా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు తాజాగా ఈయన తనుకు అల్లు అర్జున్ సినిమాలో కూడా అవకాశం వచ్చింది అంటూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈయనకు ఈ మధ్యకాలంలో మీకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయట నిజమే కదా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు తాత సమాధానం చెబుతూ భగవంతుడు దయవల్ల తనకు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయని ఫిబ్రవరిలో అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నానని ఈయన వెల్లడించారు.

ఫిబ్రవరిలో అల్లు అర్జున్ సినిమా షూటింగ్ అంటే తప్పకుండా ఈయనకు (Pushpa2) పుష్ప 2 సినిమాలో నటించే అవకాశం వచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు నిజంగానే ఈ సినిమాలో ఈయనకు అవకాశం వచ్చి గనుక ఉంటే ఈయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని పలువురు భావిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఈయన ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు ఏంటి అనే విషయాల గురించి అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus