మా ఆయన సినిమాలో హీరో ఇంకా సెలక్ట్ అవ్వలేదండీ బాబూ!

  • June 11, 2016 / 06:15 AM IST

సుందర్ సి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించనున్నదని వార్తలు వినవచ్చాయి. అయితే ఈ వార్తలను సుందర్ సి సతీమణి, నటి ఖుష్బూ సుందర్ ఖండించారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా ఖరారు చేయలేదని ఆమె తెలిపారు.

అదే విధంగా దర్శకుడు, 2డి ఎంటర్టైన్మెంట్ సహనిర్మాత రాజ్ శేఖర్ పాండియన్ స్పందిస్తూ.. ‘ రూమర్లను నమ్మోద్దు. సూర్య ఏదైనా చిత్రాన్ని ఒప్పుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటిస్తార’ న్నారు. కాగా ప్రస్తుతం సూర్య ‘ఎస్3’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus