సినిమాల పై ఆశ తగ్గలేదనుకుంట ఈ అందాల ఎంపీకి..!

  • August 12, 2019 / 07:17 PM IST

కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున నుస్రాత్ జాహాన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ళలోనే నుస్రాత్ ఎన్నికల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా నుస్రాత్ పోటీ చేసి భారీ విజయం సాధించింది. బిజెపి ఎంపీని నుస్రాత్ దాదాపు 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించింది. తరువాత జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నుస్రాత్ పాల్గొంది. ఎన్నికల్లో పూర్తయ్యాక తర్వాత నిఖిల్ జైన్ అనే బిజినెస్మేన్ ను పెళ్ళి చేసుకుంది.

ఈ క్రమంలో రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి తన భర్తతో కలసి విదేశాలకు హాలిడే ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ బీచుల్లో విహరిస్తున్న ఫోటోలని నుస్రాత్ థన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడ బికినిలో ఉన్న ఫోటోలని కూడా నుస్రాత్ షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నుస్రాత్ కొన్ని బెంగాలీ చిత్రాల్లో కూడా నటించింది. రాజకీయాల్లోకి వచ్చి.. ఎంపీ అయ్యాక కూడా ఈ గ్లామర్ షో ఏంటని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. బికినిలో మాత్రమే కాదు అనేక గ్లామరస్ ఫోటో షూట్లు కూడా ఏమె పాల్గొంది. ఎంపీ అయ్యాక కూడా ఈమెకు సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు ఉంది. అందుకే ఇలా గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తుంది.

1

2

3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus