‘ఆదిపురుష్’ లో ప్రభాస్ తమ్ముడిగా ఆ తమిళ యంగ్ హీరో ఫిక్సట..!

  • September 21, 2020 / 07:56 PM IST

ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తూనే మరో రెండు పాన్ ఇండియా చిత్రాలు చెయ్యడానికి కూడా ప్రభాస్ రెడీ అయిపోయాడు. అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకటి కాగా.. మరొకటి ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో చెయ్యబోతున్న మైతిలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’ కావడం విశేషం. ఇందులో ‘ఆది పురుష్’ చిత్రమే మొదట సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది.

ఎందుకంటే ఈ చిత్రానికి ప్రభాస్ కేవలం 60 రోజుల నుండీ 70 రోజుల కాల్షీట్లు ఇస్తే సరిపోతుందట. బ్యాలన్స్ మొత్తం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. టి.సిరీస్ వారు ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. అతన్ని ఢీ కొట్టే లంకేష్ పాత్రలో కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

ఇక సీత పాత్ర కోసం లుక్ టెస్ట్ లు జరుగుతున్నాయట. కియారా అద్వానీ, ఊర్వశి రౌటేలా, అనుష్క శర్మ వంటి స్టార్ హీరోయిన్లను సీత పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. ఇక లక్ష్మణుడి పాత్ర కోసం కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళిని సంప్రదించినట్టు తాజా సమాచారం. ఈ పాత్ర చెయ్యడానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్యనే తమిళ్ తో పాటు తెలుగులో కూడా పాపులారిటీ సంపాదించుకున్న అధర్వ మురళి.. ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పిస్తాడేమో చూడాలి..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus