గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న “నాగచైతన్య – సమంత”ల పెళ్లి విషయం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. మొదట్లో చెప్పీ చెప్పనట్లుగా తనకు కాబోయే భర్త గురించి బాగా ఊరించిన సమంత, ఆ తర్వాత అతగాడి కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా.. మిన్నకుండిపోయింది. ఆ తర్వాత తన నాగచైతన్య ఇచ్చిన సపోర్ట్ తో పబ్లిక్ గా అతడితో తిరగడం ఆరంభించేసింది. ఇప్పుడు నాగచైతన్య తల్లి మరియు నాగార్జున మొదటి భార్య అయిన “లక్ష్మీ రామానాయుడు” వీరి పెళ్ళికి అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. నేడు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఈ విషయమై ఓ ప్రత్యేక కథనం వెలువడించింది.
ఈ కథనం గురించి అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ స్పందించకపోవడమే కాక ఖండించకపోవడంతో.. అందరూ ఈ వార్త నిజమే అనుకొంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం.. నాగార్జునను అడిగితే కాదనడంతో, నాగచైతన్య తన తల్లి పర్మిషన్ తీసుకొని సమంతను వివాహమాడేందుకు సన్నద్ధమవుతున్నాడని చెప్పుకొంటున్నాయి! ఇదిలా ఉండగా.. సమంత “అ ఆ” తర్వాత మరో సినిమా అంగీకరించకపోవడం, నాగచైతన్య కూడా సమంతతో బాగా క్లోజ్ గా, పబ్లిక్ గా తిరుగుతుండడం ఈ కథనాలకు ఆజ్యం పోస్తోంది.