హోస్ట్‌పై నిర్ణయం తీసుకున్న స్టార్‌ హీరో

  • June 15, 2021 / 12:04 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త శాంతించడంతో రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ టీమ్‌ మళ్లీ యాక్టివ్‌ అయిపోయింది. వరుసగా అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ను స్టార్ట్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుకు సంబంధించి ఇప్పటికే సెట్‌ వర్క్‌ కూడా మొదలైపోయిందని సమాచారం. ఇక తాజాగా తమిళ బిగ్‌బాస్‌ గురించి ఆసక్తికరమైన సమాచారం వచ్చింది. ఈ సారి బిగ్‌బాస్‌కు ఎప్పటిలాగే కమల్‌ హాసన్ హోస్ట్‌ చేస్తున్నారట. దీంతో హోస్ట్‌ పుకార్లు ఇక ఆపేయొచ్చు అంటున్నారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌, అతని పార్టీ ఎంఎన్‌ఎం దారుణంగా ఓటమిపాలయ్యాయి. దీంతో కమల్‌ రాజకీయాలకు దూరం అవుతారు అని కొందరు అనుకున్నారు. అయితే అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చారు కమల్‌. మరోవైపు సినిమాలు రీస్టార్ట్‌ చేస్తున్నారు. ‘విక్రమ్‌’, ‘ఇండియన్‌ 2’ సినిమాల చిత్రీకరణలు త్వరలో మొదలవుతాయి. ఈ సినిమాలతో బిజీ అవుతాడు కాబట్టి కమల్‌ ‘బిగ్‌బాస్‌’ నుండి తప్పుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి. కమల్ ‘బిగ్ బాస్’కు బైబై చెప్పేస్తాడని, ఐదో సీజన్‌కు శింబు హోస్ట్‌ అవుతాడని కూడా వార్తలొచ్చాయి.

దీంతో కమల్‌, శింబుకు మధ్య పోటీపెట్టుకొని ఎవరు బాగుంటారు అనే లెక్కలు కూడా వేసుకున్నారు. అయితే ఆ లెక్కల కాగితాలు కొన్ని రోజులు పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే తమిళనాడు ఇంత త్వరగా ఎన్నికలు లేవు, కాబట్టి కమల్‌ రాజకీయ ఆలోచనలకు కాస్త గ్యాప్‌ ఇవ్వొచ్చు. సినిమాలు చేస్తూ, బిగ్‌బాస్‌ షోను కంటిన్యూ చేస్తాడన్నమాట.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus