బయోపిక్ లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎక్కడివరకు చూడవచ్చు?
August 11, 2018 / 02:26 PM IST
|Follow Us
మహానుభావుడు నందమూరి తారక రామారావు జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని వెండితెరపై మూడు గంటల్లో చూపించాలంటే చాలా కష్టం. అందుకే రెండు భాగాలుగా తీద్దామనుకుంటే బాలయ్య ఒప్పుకోలేదు. సో కథ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సాగుతుంది? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న?.. తాజాగా ఇందుకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్ బయోపిక్ బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని సమాచారం. అంటే ఎన్టీఆర్ కథను బసవతారకం చెబుతారన్నమాట. ఎన్టీఆర్ కు 1942 టైమ్ లోనే పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ కు బసవతారకంకూ బంధుత్వం కూడా ఉంది. సో, ఆ విధంగా వాళ్ల అరేంజ్డ్ మ్యారేజ్, ఇండస్ట్రీకి రావడం, సినిమాలు, రాజకీయాలు అన్నీ బసవతారకం యాంగిల్ లో స్టోరీ ఉంటుందని టాక్. బసవతారకం 1985లో మరణించారు.
అంటే అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, నాదెండ్ల వెన్నుపోటు, మళ్లీ దాన్ని అధిగమించి అధికారంలోకి రావడం జరిగిపోతాయి. అప్పుడు ఆమె మరణించారు. సో సినిమా ఆ విధంగా బసవతారకంతో మొదలై, బసవతారకంతో ఎన్టీఆర్ బయోపిక్ ముగియనుంది. కాబట్టి ఎన్టీఆర్ రెండో పెళ్లి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలు ఇందులో చూపించడం లేదని స్పష్టమయింది. కొన్నిరోజుల క్రితం మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. నారా చంద్రబాబు నాయుడి గా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ నటిస్తున్న ఈ సినిమాలో బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.