తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!

  • August 7, 2022 / 12:01 AM IST

సినిమాల్లో హీరో, హీరోయిన్లకి ఉండే ప్రాధాన్యతే వేరు.ఎలాంటి సినిమా అయినా సరే.. దర్శకుడు ఏదో ఒకటి చేసి చివరికి హీరో, హీరోయిన్లను క్లైమాక్స్ లో కలిపేసి శుభం కార్డు వేయాలి. లేదంటే ఆ సినిమా ప్లాప్ అని డిక్లేర్ చేసేస్తారు ప్రేక్షకులు. అసలే మన తెలుగు ప్రేక్షకులు బాగా సెన్సిటివ్.ట్రాజెడీ తో కూడుకున్న ఎండింగ్ లను వారు భరించలేరు. ఒకవేళ హీరో చనిపోవాల్సి వస్తే, డబుల్ రోల్ ఉన్నట్లు పెట్టాలి. అలా అయితేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పటి రోజుల్లో చాలా వరకు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇలాంటి క్లైమాక్స్ లకు ఓకే చెప్పడం లేదు. అయితే రిస్క్ అని భావించినా కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఇలా చనిపోయే పాత్రలు పోషించారు. వారు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) తరుణ్ :

‘ఒక ఊరిలో’ అనే చిత్రంలో తరుణ్ హీరోగా నటించాడు. సలోని హీరోయిన్ గా నటించగా రాజా సెకండ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో తరుణ్ పాత్ర చనిపోతుంది. అది ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సినిమా ప్లాప్ అయ్యింది.

2) మహేష్ బాబు :

శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘బాబీ’ అనే చిత్రం చేశాడు. ఈ మూవీలో మహేష్ బాబు పాత్ర క్లైమాక్స్ లో చనిపోతుంది. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పాత్ర కూడా చనిపోతుంది. సినిమా ప్లాప్ అన్న సంగతి తెలిసిందే.

3) నాగార్జున :

‘రాజన్న’ చిత్రంలో నాగార్జున పాత్ర చనిపోతుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకుడు.

4) ప్రభాస్ :

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ ‘చక్రం’ అనే చిత్రం చేశాడు. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర చనిపోతుంది. సినిమా ప్లాప్ అయ్యింది. బాహుబలి 2 లో కూడా ప్రభాస్ పాత్ర చనిపోతుంది కానీ డ్యూయల్ రోల్ కాబట్టి వర్కౌట్ అయిపోయింది.

5) ఎన్టీఆర్ :

‘ఆంధ్రావాలా’ ‘జై లవ కుశ’ ‘యమదొంగ’ చిత్రాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు చనిపోతాయి. ‘యమదొంగ’ విషయంలో రాజమౌళి మ్యాజిక్ చేశాడు. కానీ మిగిలిన రెండు సినిమాల్లో డ్యూయల్ రోల్ కావడంతో అజస్ట్ అయిపోయారు ప్రేక్షకులు.

6) నాని :

‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘ఈగ’ ‘జెర్సీ’ వంటి సినిమాల్లో నాని పాత్రలు చనిపోతాయి. ‘జెంటిల్ మన్’ ‘శ్యామ్ సింగ రాయ్’ లో మాత్రం డ్యూయల్ రోల్ కాబట్టి వర్కౌట్ అయిపోయాయి.

7) రానా :

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో క్లైమాక్స్ లో రానా పాత్ర చనిపోతుంది. హీరోయిన్ కాజల్ పాత్ర కూడా ఈ చిత్రంలో చనిపోతుంది.

8) అడివి శేష్ :

‘మేజర్’ చిత్రంలో శేష్ పాత్ర చనిపోతుంది. ఇది సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేసేశారు.

9) సాయి ధరమ్ తేజ్ :

‘నక్షత్రం’ ‘రిపబ్లిక్’ వంటి సినిమాల్లో సాయి తేజ్ పాత్రలు చనిపోతాయి.

10) అల్లు అర్జున్ :

‘వేదం’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చనిపోతుంది.

11) మంచు మనోజ్ :

‘వేదం’ చిత్రంలో మనోజ్ పాత్ర కూడా చనిపోతుంది.

12) వరుణ్ తేజ్ :

‘కంచె’ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర చనిపోతుంది. హీరోయిన్ పాత్ర కూడా చనిపోతుంది అన్న సంగతి తెలిసిందే.

13) విజయ్ దేవరకొండ :

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో సెకండ్ హీరోగా చేసిన విజయ్ దేవరకొండ పాత్ర చనిపోతుంది అన్న సంగతి తెలిసిందే.

14) దుల్కర్ సల్మాన్ :

‘సీతా రామం’ చిత్రంలో దుల్కర్ పాత్ర చనిపోతుంది.

15) కళ్యాణ్ రామ్ :

‘బింబిసార’ చిత్రంలో కళ్యాణ్ రామ్ పోషించిన టైటిల్ రోల్ చనిపోతుంది. అయితే ఇంకో పాత్ర ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus