Legend Saravanan: ‘ఈ కళాఖండాన్ని క్లాసిక్ అని నువ్వే చెప్పుకోవాలి’ అంటూ కామెంట్స్!
October 21, 2022 / 05:19 PM IST
|Follow Us
శరవణన్ స్టోర్స్ అధినేత లెజెండ్ శరవణన్ అలియాస్ శరవణన్ అరుళ్ ‘ది లెజెండ్’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. సినిమా అంటే ప్యాషన్ కావడంతో తానే నిర్మాతగా మారి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఆయనకి యాక్టింగ్ అంటే ఇష్టం కనుక తమ బ్రాండ్ ప్రమోషనల్ యాడ్స్ లో పలువురు సెలబ్రిటీలతో కలిసి నటించాడు. మూవీస్ లో ఎంట్రీ ఇవ్వడానికి, తన లాంఛింగ్ తానే భారీ సన్నాహాలు చేసుకున్నాడు.
శరవణన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి.. భారీ బడ్జెట్, హెవీ స్టార్ కాస్టింగ్, బ్యూటిఫుల్ లొకేషన్స్, హై టెక్నికల్ వాల్యూస్ తో ‘ది లెజెండ్’ సినిమా చేశాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుండి శరవణన్ లుక్, ఫిజిక్ మీద బీభత్సమైన ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. 50 ఏళ్ల వయసులో హీరో, కూతురు కన్నా తక్కువ వయసున్న అమ్మాయిలతో రొమాన్స్.. లిల్లీపుట్ లా ఉన్నావ్.. నువ్వు హీరో ఏంటి?.. అవసరమా నీకు సినిమాలు? అంటూ ఏకిపారేశారు.
సాధారణంగా పాన్ ఇండియా మూవీ అంటే ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారు. కానీ ప్రమోషన్స్ లోనే పాన్ ఇండియా స్పీచ్ ఇచ్చాడీయన. తన స్పీచ్ లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ కలిపి కొట్టాడు. జూలై 28న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శరవణన్ ని చూసి కాసేపు నవ్వుకుందాం అని థియేటర్లకి వెళ్లారు. మొత్తానికి సినిమా ఎలా వచ్చి ఎలా వెళ్లిందో కూడా చాలామందకి తెలీదు.
కట్ చేస్తే, శరవణన్ చేసిన ‘ది లెజెండ్’ అనే కళాఖండాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేద్దామని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కి ముందు, రిలీజ్ తర్వాత ఈ మూవీకి పలు ఓటీటీల నుండి మంచి ఆఫర్స్ వచ్చినా కానీ ‘నో’ చెబుతున్నాడట శరవణన్.. దీనికి కారణం ఏంటి? అని అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదట.
‘‘ది లెజెండ్’ అనే సినిమాను నేను ఎంతో ఇష్టపడి తీశాను. నేను నటించి, నిర్మించిన ఈ క్లాసిక్ మూవీ చాలా ఈజీగా అందరికీ అందుబాటులో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు’’ అని చెప్పారట. దీంతో.. ‘‘నీ కళాఖండాన్ని క్లాసిక్ అని నువ్వే చెప్పుకోవాలి.. హోమ్ థియేటర్లో వేసుకుని ఒక్కడివే చూసుకో’’ అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.