Lijomol Jos: ఆ పని చేస్తే తప్పేంటన్న జైభీమ్ సినతల్లి!
November 22, 2021 / 09:50 AM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో జై భీమ్ సినిమా కూడా ఒకటనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించారు. గిరిజన మహిళ, గర్భవతిగా సినతల్లి పాత్రకు లిజోమోల్ జోస్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మలయాళ, తమిళ సినిమాలలో ఎక్కువగా నటించిన లిజోమోల్ జోస్ టాలీవుడ్ కు డబ్బింగ్ మూవీ అయిన ఒరేయ్ బామ్మర్ది సినిమాతో పరిచయమయ్యారు.
అయితే ఆ సినిమా కంటే జై భీమ్ మూవీతోనే లిజోమోల్ జోస్ కు గుర్తింపు దక్కింది. సినతల్లి పాత్ర గురించి లిజోమోల్ జోస్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జై భీమ్ సినిమా కొరకు ఎంతో హార్డ్ వర్క్ చేశానని ఈ సినిమా కోసం గిరిజనుల గుడిసెలకు వెళ్లడంతో పాటు వాళ్లు చేసే పనులను కూడా తాను చేశానని లిజోమోల్ జోస్ పేర్కొన్నారు. గిరిజనులతో కలిసి వేటకు వెళ్లడంతో పాటు చెప్పులు లేకుండా తిరిగానని లిజోమోల్ జోస్ అన్నారు.
గిరిజనులు పొలాల్లో దొరికే ఎలుకలను తింటారని తాను కూడా ఎలుక కూర తినగా ఎలుక కూర చికెన్ లా అనిపించిందని లిజోమోల్ జోస్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఎలుక కూర తిన్నావా? అని ప్రశ్నించగా తింటే తప్పేంటని తాను అడిగానని ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎలుక కూర గురించి ప్రస్తావించలేదని లిజోమోల్ జోస్ అన్నారు. జై భీమ్ ద్వారా లిజోమోల్ జోస్ కష్టానికి తగిన ఫలితం పొందారనే చెప్పాలి.