విజయ్ బిన్నీతో పాటు దర్శకులుగా మారిన 10 మంది కొరియోగ్రాఫర్ల లిస్ట్..!
February 5, 2024 / 10:48 AM IST
|Follow Us
కొన్ని పాటలు వినడానికి ఎంత బాగుంటాయో.. చూడటానికి అంతకన్నా బాగుంటాయి. అందుకు ముఖ్య కారణం కచ్చితంగా కొరియోగ్రాఫర్ వల్లనే అని చెప్పాలి. డౌట్ లేకుండా ఆ క్రెడిట్ మొత్తం కొరియోగ్రాఫర్ కి మాత్రమే దక్కుతుంది. వాళ్ళ వర్క్ గురించి ఒకప్పుడు పెద్దగా తెలిసేది కాదు. కానీ తర్వాత పలు డాన్స్ షోలు రావడంతో వాళ్లకి కూడా మంచి పబ్లిసిటీ దక్కడం మొదలైంది అనుకోవచ్చు.ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరగడంతో బుల్లితెరపై కూడా వాళ్ళు బిజీ అయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొంతమంది కొరియోగ్రాఫర్లు అయితే డైరెక్టర్లుగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. అలా డైరెక్టర్లుగా మారిన కొరియోగ్రాఫర్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) సుజి :
ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి సుజి ‘మనసా తుళ్ళిపడకే’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. 2014 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2) విద్యాసాగర్ రాజు:
ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి విద్యాసాగర్ రాజు .. 2018లో వచ్చిన ‘రచయిత’, 2021 లో వచ్చిన ‘ఎఫ్ కుక్'(ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు.
3) పాల్ మాస్టర్ :
‘దిల్ సే’ అనే తెలుగు సినిమాని డైరెక్ట్ చేశారు పాల్ మాస్టర్.
4) అజయ్ మాస్టర్:
కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికందన్ అలియాస్ ‘మథనం’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు.
5) శివాజీ మాస్టర్:
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివాజీ మాస్టర్ ‘తియ్యని కలవో’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
6) హరి ప్రసాద్ మాస్టర్ :
‘సిబిఐ’ ‘వైరస్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు కొరియోగ్రాఫర్ హరి ప్రసాద్ మాస్టర్.
7) వీరాస్వామి మాస్టర్ :
‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు కొరియోగ్రాఫర్ వీరాస్వామి మాస్టర్
8) భరత్ కొమ్మలపాటి :
కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి ‘మిస్టేక్’, ‘ఎస్5 : నో ఎగ్జిట్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు.
9) బాబా భాస్కర్ :
తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన బాబా భాస్కర్ ‘కుప్పతు రాజా’ అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించారు.
10) రాఘవ లారెన్స్ :
లారెన్స్ మాస్టర్ అందరికీ తెలుసు కదా. తర్వాత ఈయన హీరోగా మారారు. అటు తర్వాత డైరెక్టర్ గా కూడా మారి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు.
11) అమ్మ రాజశేఖర్ :
గోపీచంద్ తో చేసిన ‘రణం’ సినిమాతో దర్శకుడిగా మారాడు అమ్మ రాజశేఖర్. ఆ తర్వాత ‘ఖతర్నాక్’ ‘టక్కరి’ వంటి సినిమాలని కూడా డైరెక్ట్ చేశాడు.
12) రాజు సుందరం :
అజిత్ తో ‘ఏగన్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు కొరియోగ్రాఫర్ రాజు సుందరం. నయనతార ఇందులో హీరోయిన్ గా నటించింది. నవదీప్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఇదే సినిమా తెలుగులో ‘మల్లిక’ పేరుతో డబ్ అయ్యింది.
13) ప్రభుదేవా :
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘పౌర్ణమి’ ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశాడు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. హిందీలో కూడా చాలా సూపర్ హిట్ మూవీస్ ను అందించాడు.
14) విజయ్ బిన్నీ :
ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ (Vijay Binni) ఈ మధ్యనే దర్శకుడిగా మారి నాగార్జునతో ‘నా సామి రంగ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
15) సుచిత్ర చంద్రబోస్ :
‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే సినిమాకి డైరెక్షన్ చేశారు చంద్రబోస్ సతీమణి అలాగే కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర చంద్రబోస్.