‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
January 17, 2024 / 04:44 PM IST
|Follow Us
ఈరోజుల్లో ఓ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ లేదా మిక్స్డ్ టాక్ వస్తే.. రెండో రోజు నుండి జనాలు ఉండటం లేదు. హ్యాపీగా ఓటీటీలో ఆ సినిమాని చూసుకోవచ్చులే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ సంక్రాంతి సీజన్లో అలా ఉండదు. సినిమా ఎలా ఉన్నా.. భోగి, సంక్రాంతి , కనుమ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా చూడటానికి జనాలు రెడీగా ఉంటారు. అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ అయ్యింది. దానికి మొదటి రోజు వచ్చిన టాక్ ను బట్టి.. రెండో రోజు నిలబడుతుంది అని అంచనా వేసిన వాళ్ళు లేరు.
కానీ ఆ సినిమా ట్రేడ్ పండితులు సైతం షాక్ తినే విధంగా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. ఫుల్ రన్లో ఇది యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది అనే చెప్పాలి. ఇలా గతంలో కూడా కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్/మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కేసిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) బిజినెస్ మెన్ :
2012 లో మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘పోకిరి’ తర్వాత వచ్చిన ఈ సినిమా .. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. ‘పోకిరి’ రేంజ్లో ఈ సినిమా లేదు అనే విమర్శలు వచ్చాయి. కానీ సంక్రాంతి సీజన్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.
2) నాయక్ :
2013 లో వచ్చిన ఈ మూవీలో రాంచరణ్ డబుల్ రోల్ ప్లే చేయగా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి రోజు మిక్డ్స్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ అలాగే దర్శకుడు వి.వి.వినాయక్ కి సంక్రాంతి ట్రాక్ రికార్డు కలిసొచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.
3) ఐ :
ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ కాబట్టి.. తెలుగు ప్రేక్షకులు కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు. అయితే మొదటి రోజు ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే క్యాష్ చేసుకుంది. ఫైనల్ గా యావరేజ్ మూవీగా నిలిచింది.
4) నాన్నకు ప్రేమతో :
ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2016 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే క్యాష్ చేసుకుంది. ఎన్టీఆర్ కి మొదటి రూ.50 కోట్ల షేర్ మూవీని అందించింది. ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
5) శతమానం భవతి :
శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.2017 సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే క్యాష్ చేసుకుంది. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
6) జై సింహా :
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.
7) సరిలేరు నీకెవ్వరు :
2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు డివైడ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే మహేష్ బాబు ,దర్శకుడు అనిల్ రావిపూడి..లకి ఉన్న క్రేజ్ అలాగే సంక్రాంతి సీజన్ ను వాడుకుని ఫైనల్ గా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
8) మాస్టర్ :
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా.. మనకి డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, తెలుగులో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు కాబట్టి.. సంక్రాంతి సీజన్ ను కూడా వాడుకుని, నెగిటివ్ టాక్ వచ్చినా ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9) రెడ్ :
రామ్ డబుల్ రోల్ చేసిన ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకుడు.2021 సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. సంక్రాంతి సీజన్ వల్లే ఈ సినిమాకి కలిసొచ్చింది అని చెప్పాలి.
10) వీరసింహారెడ్డి :
2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా (Veera Simha Reddy) మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. సంక్రాంతి సీజన్ కలిసి రావడం, బాలకృష్ణ ఫామ్లో ఉండటం వల్లే ఈ మూవీకి కలిసొచ్చింది అని చెప్పాలి.