‘1 నేనొక్కడినే’ టు ‘టైగర్ నాగేశ్వరరావు’.. రిలీజ్ తర్వాత సీన్లు కట్ చేసిన 10 సినిమాల లిస్ట్
October 27, 2023 / 01:16 PM IST
|Follow Us
గతంలో కొన్ని సినిమాలకి రిలీజ్ తర్వాత.. కొత్త సీన్లు యాడ్ చేయడం వంటివి చూశాం. ‘చూడాలని ఉంది’ ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘ఎఫ్ 2 ‘ వంటి సినిమాల విషయంలో అది జరిగింది. హిట్ టాక్ వచ్చిన సినిమాలకి రిపీట్ ఆడియన్స్ ని రప్పించి కలెక్షన్స్ ఇంకా పెంచుకోవాలి… లాంగ్ రన్ సినిమాని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో మేకర్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు. అదొక సక్సెస్ ఫుల్ ఫార్ములా అని చెప్పుకోవచ్చు. నిజంగానే కొత్త సీన్లు యాడ్ చేయడం వల్ల కొంత మంది ప్రేక్షకులు అలా థియేటర్లకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రిపీట్ ఆడియన్స్ విషయంలో..! ఇదంతా హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి జరిగింది.
అయితే మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల విషయంలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది అని చెప్పవచ్చు. ఇక్కడ ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలకి ఎవ్వరూ ఏమీ చేయలేదు. కానీ మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలకి ‘లెంగ్త్ ఎక్కువైంది.. ఈ సీన్లు తీసేస్తే బాగుండేది’ అనే కంప్లైంట్స్ వచ్చేవి. అప్పుడు మేకర్స్ వెంటనే ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సన్నివేశాలని తీసేసి.. తమ సినిమాని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా రిలీజ్ తర్వాత సీన్లు కట్ చేయబడ్డ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) హోమం :
జగపతి బాబు హీరోగా జె.డి.చక్రవర్తి విలన్ గా, డైరెక్టర్ గా చేసిన ఈ సినిమా 2008 లో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో మేకర్స్ కొన్ని సన్నివేశాలను కట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
2) రోబో :
రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ రిలీజ్ తర్వాత సెకండ్ హాఫ్ లో కళాభవన్ మణి సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఓ వర్గం నుండి కంప్లైంట్ వస్తే. ఆ సన్నివేశాలను డిలీట్ చేయడం జరిగింది.
3) ఎందుకంటే ప్రేమంట :
రామ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో మేకర్స్ కొంత భాగాన్ని ట్రిమ్ చేసి .. కొన్ని రోజుల పాటు థియేటర్లలో ఈ సినిమా నిలబడేలా చేశారు.
4) బ్రదర్స్ :
సూర్య డబుల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని కె.వి.ఆనంద్ డైరెక్ట్ చేశారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా రన్ టైంకి ప్రేక్షకులు భయపడిపోయారు. సినిమాకి కూడా నెగిటివ్ టాక్ రావడంతో.. మేకర్స్ వెంటనే కొన్ని సన్నివేశాలు డిలీట్ చేయడం జరిగింది.
5) మసాలా :
వెంకటేష్ – రామ్ చేసిన ఈ మల్టీస్టారర్ కి విజయ్ భాస్కర్ దర్శకుడు. రిలీజ్ తర్వాత ఈ సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కొన్ని సన్నివేశాలు డిలీట్ చేశారు మేకర్స్.
6) 1 నేనొక్కడినే :
మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో కొన్ని సన్నివేశాలు డిలీట్ చేశారు మేకర్స్.
7) బ్రహ్మోత్సవం :
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో కొన్ని సన్నివేశాలు డిలీట్ చేశారు మేకర్స్.
8) అర్జున్ రెడ్డి :
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ కొన్ని సీన్స్ .. రిలీజ్ తర్వాత కట్ చేయడం జరిగింది.
9) దేవ్ :
కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. రిలీజ్ తర్వాత కొన్ని సన్నివేశాలు డిలీట్ చేశారు. అయినా ఫలితం మారలేదు. సినిమా ప్లాప్ గానే మిగిలింది.
10) టైగర్ నాగేశ్వరరావు :
ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. రిలీజ్ కి ముందు రన్ టైం ఎక్కువ కదా అని అడిగితే దర్శకుడు ‘ఆర్.ఆర్.ఆర్’ రన్ టైం 3 గంటలు లేదా? అని సమాధానం ఇచ్చాడు. రిలీజ్ తర్వాత 15 నిమిషాల పార్ట్ ను ట్రిమ్ చేయడం జరిగింది.