చిరు టు నాగ చైతన్య.. జర్నలిస్ట్ పాత్రలు పోషించిన 15 మంది హీరోల లిస్ట్..!
December 5, 2023 / 11:19 AM IST
|Follow Us
టాలీవుడ్లో సోషల్ ఇష్యూస్ మీద ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా..! ఇది కమర్షియల్ ఫార్ములా అని నమ్మే దర్శకులు, హీరోలు.. కూడా చాలా మంది ఉన్నారు. ఓ ఇష్యూ తీసుకుని, దాని చుట్టూ కొన్ని మాస్ సీన్లు పడేలా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని, హీరోతో నాలుగు పంచ్ డైలాగులు చెప్పించి, చివర్లో ఓ మెసేజ్ ఇప్పిస్తే చాలు.. అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతారు. ఇందుకు హీరో పోలీస్, కలెక్టర్ లేక పొలిటీషియన్ అయ్యుండాలి అని అంతా భావిస్తారు, ఆశిస్తారు.
కానీ వారితో సమానమైన బాధ్యత, గౌరవం కలిగిన జర్నలిస్ట్ పాత్ర హీరో పోషించాలని కోరుకునే ప్రేక్షకులు ఎక్కువ మంది ఉండరు. రాజకీయ నాయకుల దృష్టికి, ప్రజల సమస్యని చేరవేసేది జర్నలిస్టులే అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎండని, వానని, చలిని.. లెక్కచేయకుండా నిజం కోసం అన్వేషించేది జర్నలిస్టులే. కానీ ఆ పాత్రలో నటించింది చాలా తక్కువ మంది హీరోలే. వాళ్ళు ఎవరు? ఆ పాత్రలు వారికి ఎంత వరకు కలిసొచ్చాయి అనే విషయాన్ని ఓ లుక్కేద్దాం రండి :
1) పవన్ కళ్యాణ్ :
‘బంగారం’ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ గా కనిపించారు. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
2) వెంకటేష్ :
తిరుపతి స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘గణేష్’ మూవీలో వెంకటేష్ ఓ జర్నలిస్ట్ గా కనిపిస్తారు. మెడికల్ మాఫియా పై గణేష్ తిరుగుబాటును ప్రేక్షకులు ఆదరించారు. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
3) బాలకృష్ణ :
రవి చావలి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘శ్రీమన్నారాయణ’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ జర్నలిస్ట్ గా కనిపిస్తారు. కానీ ఈ సినిమా ఎందుకో సక్సెస్ కాలేదు.
4) రవితేజ :
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఆంజనేయులు’ సినిమాలో రవితేజ కూడా జర్నలిస్ట్ గా కనిపిస్తారు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. కమర్షియల్ సక్సెస్ అందుకుంది. బండ్ల గణేష్ ఈ చిత్రంతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.
5) నాని :
‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నాని జర్నలిస్ట్ పాత్రను పోషించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది.
6) నిఖిల్ :
టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే మూవీ రూపొందింది. ఇందులో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రని పోషించాడు. ఈ సినిమా బాగానే ఆడింది.
7) కళ్యాణ్ రామ్ :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ అనే సినిమాలో కళ్యాణ్ రామ్.. జర్నలిస్ట్ పాత్రని పోషించాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
8) జీవా :
దివంగత స్టార్ డైరెక్టర్ కె.వి.ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘రంగం’ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించాడు జీవా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
9) చిరంజీవి :
శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘అందరివాడు’ సినిమాలో సిద్దార్థ్ అనే జర్నలిస్ట్ గా చిరంజీవి కనిపించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
10) నాగశౌర్య :
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో వెంకీ అనే జర్నలిస్ట్ పాత్రలో నాగ శౌర్య కనిపించాడు. ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
11) అర్జున్ షార్జా :
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ జర్నలిస్ట్ గా కనిపించి మెప్పించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
12) శ్రీహరి :
మోహన్ గాంధీ దర్శకత్వంలో ‘పరశురామ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో హీరో శ్రీహరి ఓ జర్నలిస్ట్ గా కనిపించారు.
13) తారకరత్న :
బాలశేఖరన్ దర్శకత్వంలో ‘తారక్’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన దివంగత తారకరత్న ఓ జర్నలిస్ట్ గా కనిపించాడు.అలాగే ఈ సినిమాలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు. అయితే సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది.
14) నవదీప్ :
శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లో హీరో (Heroes) నవదీప్ జర్నలిస్ట్ గా కనిపించారు.
15) దూత :
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో హీరో నాగ చైతన్య జర్నలిస్ట్ పాత్రలో నటించి మెప్పించారు.