Chiranjeevi, Sarath Babu: ‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!
May 24, 2023 / 07:04 PM IST
|Follow Us
సీనియర్ నటుడు శరత్ బాబు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు శరత్ బాబు. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెరుగైన వైద్యం నిమిత్తం ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి మార్చడం కూడా జరిగింది. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
ఈ విషయాన్ని వైద్య సిబ్బంది వెల్లడించింది. శరత్ బాబు నివాసం చెన్నైలో ఉన్నందున ఆయన పార్ధీవ దేహాన్ని అక్కడికి మార్చారు. శరత్ బాబు పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు చెన్నైలో ఉన్న సినీ ప్రముఖుల అందరూ తరలివెళ్లారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా తన నటనతో సత్తా చాటారు శరత్ బాబు.
ఇదిలా ఉండగా.. శరత్ బాబుకి చిరంజీవి, మోహన్ బాబు, రజినీకాంత్ లతో మంచి సాన్నిహిత్యం ఉంది. మరీ ముఖ్యంగా చిరంజీవితో.. శరత్ బాబు స్నేహం ఈనాటిది కాదు. చెన్నైలో ఇద్దరూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయం నుండి ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయో. అందులో ఎన్ని హిట్ అయ్యాయో. అలాగే వీరి కాంబోలో మిస్ అయిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఇది కథ కాదు :
కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, శరత్ బాబు, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన మూవీ ఇది. 1979 లో వచ్చిన ఈ మూవీ పెద్ద సక్సెస్ అయితే కాలేదు. జస్ట్ యావరేజ్ గానే ఆడింది. కానీ మంచి సినిమా అనిపించుకుంది. బ్లాక్ అండ్ వైట్ లోనే ఈ మూవీని చిత్రీకరించారు బాలచందర్.
2) 47 రోజులు :
చిరంజీవి, జయప్రద, శరత్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి కూడా కె.బాలచందర్ దర్శకుడు. 1981 లో వచ్చిన ఈ మూవీ కూడా జస్ట్ యావరేజ్ గానే ఆడింది. ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీనే కావడం గమనార్హం.
3) యమకింకరుడు :
రాజ్ భరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో కూడా చిరంజీవి, శరత్ బాబు కలిసి నటించారు.’గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.1982 లో వచ్చిన ఈ మూవీ మంచి ఫలితాన్నే అందుకుంది.
4) అగ్ని గుండం :
1984 లో వచ్చిన ఈ మూవీని క్రాంతి కుమార్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి, శరత్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
5) ఆపద్బాంధవుడు :
చిరంజీవి హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శరత్ బాబు చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. శరత్ బాబు చెప్పిన డైలాగులు కూడా చప్పట్లు కొట్టిస్తాయి. 1992 లో వచ్చిన ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
6) అన్నయ్య :
చిరంజీవి హీరోగా రవితేజ, వెంకట్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీలో కూడా శరత్ బాబు కీలక పాత్ర పోషించారు. ఆయన రోల్ ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమా బాగానే ఆడింది.
7) డాడీ :
2001 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఇది. చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన ఈ మూవీలో శరత్ బాబు చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా జస్ట్ యావరేజ్ గా ఆడింది.
మిస్ అయిన సినిమాలు :
8) రిక్షావోడు :
కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీలో శరత్ బాబు నటించాల్సి ఉంది. కానీ డైరెక్టర్స్ మారడం.. ఇంకా చాలా రచ్చ జరగడంతో శరత్ బాబు డేట్స్ కాళీ లేక ఈ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నారు.ఫైనల్ గా సినిమా ప్లాప్ అయ్యింది.
9) శ్రీ మంజునాథ :
చిరంజీవి శివుడి పాత్రలో చేసిన ఈ సినిమాలో (Sarath Babu) శరత్ బాబు కూడా నటించాల్సి ఉంది. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
10) మృగరాజు :
గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ మూవీలో కూడా శరత్ బాబు నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఇందులో కూడా ఆయన ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.