బాహుబలి2, పఠాన్ లతో పాటు యూ.ఎస్ టాప్-10 గ్రాసర్స్ ఏంటో తెలుసా?
February 8, 2023 / 08:33 PM IST
|Follow Us
ఓవర్సీస్ లో మిలియన్ల డాలర్ల వర్షం కురిపించిన ఇండియన్ సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా యూ.ఎస్ లో $20 డాలర్ల టికెట్ రేటు ఉన్నా లెక్కచేయకుండా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇటీవల రిలీజ్ అయిన పఠాన్ మూవీ ఏకంగా 14 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి.. ఆర్.ఆర్.ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. రేపో మాపో ‘బాహుబలి 2’ రికార్డును కూడా బ్రేక్ చేసేలా ఉంది. షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ కొడితే ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేసిన సినిమా ‘పఠాన్’. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ అక్కడ ఇంకా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఇండియన్ సినిమా చరిత్రలో .. ఓవర్సీస్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవ్వడంతో ‘పఠాన్’ కు ఈ రికార్డు క్రియేట్ చేయడం సాధ్యమైంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) బాహుబలి2 :
ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ.. యూ.ఎస్.లో ఏకంగా రూ. 20 మిలియన్ డాలర్లను వసూల్ చేసిన సినిమాగా నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది.
2) పఠాన్ :
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ… యూ.ఎస్.లో ఏకంగా రూ. 14.4 మిలియన్(సోమవారం నాటికి) డాలర్లను వసూల్ చేసి నెంబర్ 2 ప్లేస్ లో ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ‘బాహుబలి 2’ రికార్డుని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
3) ఆర్.ఆర్.ఆర్ :
రాంచరణ్ – రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ యూ.ఎస్.లో ఏకంగా రూ. 14.3 మిలియన్ డాలర్లను వసూల్ చేసి రికార్డు కొట్టింది.
4) దంగల్ :
ఆమిర్ ఖాన్ హీరోగా నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. యూ.ఎస్.లో ఏకంగా రూ. 12.3 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.
5) పద్మావత్ :
దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. యూ.ఎస్.లో ఏకంగా రూ. 12.1 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.
6) పీకే :
ఆమిర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. యూ.ఎస్.లో ఏకంగా రూ. 10.5 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. యూ.ఎస్.లో తొలి 10 మిలియన్ డాలర్లను వసూల్ చేసిన మూవీగా రికార్డులకెక్కింది పీకే.
7) బాహుబలి(ది బిగినింగ్) :
రాజమౌళి – ప్రభాస్- రానా కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ.. యూ.ఎస్.లో రూ.8.3 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.
8) బజరంగీ భాయ్ జాన్ :
సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. యూ.ఎస్.లో రూ.8.1 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.
9) ధూమ్ 3 :
ఆమిర్ ఖాన్ హీరోగా ధూమ్ సిరీస్ లో భాగంగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. యూ.ఎస్.లో రూ.8.1 మిలియన్ డాలర్లను వసూల్ చేసి అప్పట్లో రికార్డులు సృష్టించింది.
10) సంజు :
రణ్ బీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యూ.ఎస్.లో రూ.7.9 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది.