Balakrishna Rejected Movies: బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
June 10, 2021 / 05:09 PM IST
|Follow Us
ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ జూన్ 10 తో ఆయన 61 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు.45 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు బాలయ్య. ఇప్పటికీ ఆయన ఎంతో ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తుండడం విశేషం. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని పరాజయాలు వచ్చినా.. తట్టుకుని నిలబడి వాటికి ఓ మాస్ హిట్ తో సమాధానం చెప్పగల సమర్ధుడు బాలయ్య. ఆయన ఇప్పటివరకు 105 సినిమాల్లో నటించారు. అందులో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి.అయితే తన 45 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) జానకిరాముడు :
ఈ కథని మొదట స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు బాలకృష్ణతో చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కోడి రామకృష్ణ గారు ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడంతో బాలయ్య కూడా దీనిని వద్దనుకున్నారు. తర్వాత అది కె.రాఘవేంద్ర రావు గారు నాగార్జునతో చేయడం.. బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.
2) చంటి :
ఈ చిత్రాన్ని మొదట బాలకృష్ణతో చేద్దాం అనుకున్నారు పరుచూరి బ్రదర్స్. కానీ ఎందుకో బాలయ్యకు ఈ కథ నచ్చలేదు. తర్వాత రాజశేఖర్ తో చిత్రాన్ని రూపొందించాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఫైనల్ గా వెంకీ చేయడం జరిగింది. అది సూపర్ హిట్ అయ్యింది.
3) సింహరాశి :
ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్ర మొదట బాలయ్యతో చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన నొ చెప్పడంతో రాజశేఖర్ చేసి హిట్టు కొట్టడం జరిగింది.
4) సూర్యవంశం :
మొదట ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్ళిందట. కానీ ‘పెద్దన్నయ్య’ కథని పోలి ఉందని ఆయన నొ చెప్పాడట. దీంతో వెంకీ ఈ సినిమా చేయడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.
5) శివరామరాజు :
ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రకు ముందుగా బాలయ్యను సంప్రదిచారట. కానీ అప్పుడే ఇలాంటి రోల్స్ చేయడం తనకు ఇష్టం లేదని తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా సూపర్ హిట్ మూవీనే..!
6) అన్నవరం :
ఈ తమిళ్ రీమేక్ ను మొదట బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారు. కానీ బాలయ్యకి ఈ కథ నచ్చకపోవడంతో లైట్ తీసుకున్నారు.తర్వాత చిరుతో చేయాలని ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ నిర్మాతలు వారు చాలా కాలం ఎదురుచూసారు. కానీ ఫైనల్ గా అది పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. ఇది యావరేజ్ గా ఆడింది.
7) బాడీ గార్డ్ :
మొదట ఈ రీమేక్ ను బాలయ్యతో చేయాలని ఓ నిర్మాత అనుకున్నారట. కానీ ఈ లోపే ఆ రీమేక్ హక్కులను నిర్మాత బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేయడంతో.. బాలయ్య తప్పుకున్నారు. ఇద్దరికీ మనస్పర్థలు ఉన్నాయని ఎప్పటినుండో టాక్. అందుకే ఆయన ఈ మూవీకి నొ చెప్పినట్లు టాక్. తర్వాత దీన్ని వెంకీ చేయడం.. యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవడం జరిగింది.
8) సైరా :
ఈ కథ 10 ఏళ్ళ క్రితమే బాలయ్య చేయాల్సింది. కానీ ఆయన వద్దు అనుకున్నారు. తర్వాత చిరు వద్దకు వెళ్ళింది. చాలా కాలం తర్వాత ఆయన ఈ సినిమా చేయడం జరిగింది. మంచి సినిమానే అనిపించుకున్నప్పటికీ ఇది పెద్దగా ఆడలేదు.
9) క్రాక్ :
గోపీచంద్ మలినేని మొదట ఈ సినిమాని బాలయ్యతో చేయాలనుకున్నాడు. కానీ బాలయ్యకి ఈ కథ అంతగా నచ్చలేదు. దీంతో రవితేజ ఈ చిత్రం చేయడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.
10) సింహాద్రి :
ఈ చిత్రం కథని బాలకృష్ణని దృష్టిలో పెట్టుకునే డెవలప్ చేసుకున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయనే ఈ కథని డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. కానీ బాలయ్య నొ చెప్పడంతో అది దర్శకుడు రాజమౌళి వద్దకు వెళ్ళింది.అదే కథని మొదట ప్రభాస్ తో చెయ్యాలి అనుకున్నాడు రాజమౌళి కానీ ఫైనల్ గా ఎన్టీఆర్ తో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.