మార్చిలో సినిమాల సందడి..అంతకుమించి!

  • February 28, 2022 / 07:44 PM IST

మొత్తానికి కరోనా ప్రభావం మరొకసారి తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా సినిమా బిజినెస్ మళ్ళీ ఊపందుకునే అవకాశం వచ్చింది. ఫిబ్రవరిలో కొన్ని సినిమాలు అంతంత మాత్రంగానే భయంగా విడుదల అయినప్పటికీ తెలుగులో మాత్రం డీజే టిల్లు, భీమ్లా నాయక్ సినిమాలు మంచి బూస్ట్ అయితే ఇచ్చాయి. ఇక మార్చి నెలలో మాత్రం చాలా పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అప్పటి వరకు పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంటాయని అందరూ నమ్ముతున్నారు.

ఇక మార్చి నెలలో రాబోయే ఆసక్తికరమైన సినిమాలు ఎప్పుడు ఏ తేదీకి రాబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..ముందుగా మార్చి 4వ తేదీన శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక అదే తేదీన కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ పిసి 524 కూడా విడుదల కానుంది.

ఈ సినిమాపై కూడా ఓ వర్గం ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. సూర్య నటించిన ఈటి సినిమా కూడా మార్చి 10వ తేదీన తమిళ్ తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది. సూర్య ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా సూర్య తెలుగులో సరైన విజయాన్ని అందుకోవడం లేదు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ రొమాంటిక్ లవ్ అడ్వెంచరస్ మూవీ రాధేశ్యామ్ మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.

ఇక ఆ తర్వాత మార్చి 17వ తేదీన కన్నడ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి సినిమా జేమ్స్ కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఈ సినిమాలో మిగతా భాషల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 25వ తేదీన RRR సినిమా విడుదల కానుంది.ఈ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus