OTT: ఈ వారం రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్

  • May 12, 2021 / 12:47 PM IST

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను అమలు చేయడంతో ఇప్పట్లో అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేదని ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోవడంతో ఓటీటీ ఆఫర్స్ కు తలొగ్గక తప్పట్లేదు. ఇప్పటికే కొన్ని సినిమాలు థియేట్రికల్ గా విడుదలై ఇప్పుడు తొందరగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విడుదల కానీ కొన్ని సినిమాలు కూడా ఈ వారం ఓటీటీ ప్రపంచంలోకి రాబోతున్నాయి.

ముందుగా ఈ శుక్రవారం బాలీవుడ్ బిగ్ మూవీ రాధే రాబోతున్న విషయం తెలిసిందే. జీ ఫ్లెక్స్ లో పే పర్ వ్యూ పద్దతిలో 249రూపాయలు ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ధనుష్ కర్ణన్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో మే 14న సందడి చేయనుంది. బాలీవుడ్ దర్శకులు రాజ్, డీకే కాంబినేషన్ లో తెరకెక్కిన తెలుగు కామెడీ చిత్రం సినిమాబండి. ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

నెదర్లాండ్స్‌లోని డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఫెర్రీ అనే డచ్ చిత్రంపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇది మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ‘మినారి’ అనే అమెరికన్ డ్రామా ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ఇది ఉత్తమ చిత్రలలో పోటీ పడింది. ఈ చిత్రంలో నటించిన యున్ యుహ్-జంగ్ ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. మినారి ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus