‘విక్రమ్’ కంటే ముందుగా సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ తో వచ్చిన 10 సినిమాల లిస్ట్..!
June 17, 2022 / 09:27 AM IST
|Follow Us
‘విక్రమ్’ చిత్రంతో సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ అంటే ఏంటో రుచి చూపించాడు దర్శకుడు లోకేష్ కనగరాజన్. ఈ చిత్రంలో ‘ఖైదీ'(2019) లో ఢిల్లీ పాత్రని, బిజోయ్ పాత్రని ఇందులో కంటిన్యూ చేసి.. ‘ఖైదీ’ కి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయించాడు లోకేష్.’విక్రమ్’ లో కమల్ హాసన్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అతనితో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అలాగే రోలెక్స్ అనే పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ‘విక్రమ్’ సినిమాని రిపీటెడ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. తమిళ్ లో శంకర్ తర్వాత ఆ ఫీట్ సాధించింది దర్శకుడు లోకేష్ కనగరాజన్ అనే చెప్పాలి.
నిజానికి సినిమాటిక్ యూనివర్స్ ను మల్టీవర్స్ కాన్సెప్ట్ అని కూడా అంటుంటారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకి ఇది బాగా అర్థమవుతుంది. ఓ సినిమాలో పాత్ర మరో సినిమాలో కనిపించడమే ఈ కాన్సెప్ట్ యొక్క ప్రధాన అంశం. సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ని మనం గమనించలేదు కానీ.. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) యముడికి మొగుడు -అడవి దొంగ :
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘అడవి దొంగ’ లో కాళిదాసు(చిరంజీవి) పాత్ర కూడా కనిపిస్తుంది.
2) యముడికి మొగుడు – విజేత :
అలాగే ఇదే చిత్రంలో ‘విజేత’ చిత్రంలోని మధుసూదనరావు(చిరంజీవి) ప్రియదర్శిని(భాను ప్రియా) పాత్రలు కనిపిస్తాయి.
3) ఓయ్- ఛత్రపతి :
ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ చిత్రంలో ప్రదీప్ రావత్ పోషించిన రాస్ బిహారీ పాత్ర సిద్దార్థ్ హీరోగా నటించిన ‘ఓయ్’ చిత్రంలో కూడా కనిపిస్తుంది.
4) చింతకాయల రవి :
రాంచరణ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అలీ పోషించిన నచిమి పాత్ర వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘చింతకాయల రవి’ చిత్రంలో కూడా కనిపిస్తుంది.
5) రావణ్ – రోబో :
రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో చిట్టి(రోబో) పాత్ర షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రావణ్’ చిత్రంలో కూడా కనిపిస్తుంది.
6) ఘటోత్కచుడు – యమలీల :
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమలీల’ చిత్రంలో తనికెళ్ళ భరణి పోషించిన తోట రాముడు పాత్రని ‘ఘటోత్కచుడు’ చిత్రంలో కూడా కంటిన్యూ చేశాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ రెండు సినిమాలకు అతనే దర్శకుడు.
7) తెలుగు వీర లేవరా – అల్లూరి సీతారామరాజు :
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఆల్ టైం హిట్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’ లో కొన్ని పాత్రలు కృష్ణ – ఇవివి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తెలుగు వీర లేవరా’ మూవీలో కూడా కనిపిస్తాయి.
8) అల్లరి మొగుడు – మామ మంచు అల్లుడు కంచు :
మోహన్ బాబు హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లరి మొగుడు’ చిత్రంలోని హీరోయిన్ పాత్రలు అల్లరి నరేష్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రంలో కూడా కనిపిస్తాయి.
9) బాబా – నరసింహ :
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ ‘నరసింహ’ లోని నీలాంబరి పాత్ర ‘బాబా’ సినిమాలో కూడా కనిపిస్తుంది.
10) దరువు :
రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘యముడికి మొగుడు’ చిత్రంలో చిరంజీవి, ‘యమదొంగ’ లో ఎన్టీఆర్ పాత్రలని కూడా చూపిస్తారు. సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇలా ఒక సినిమాలోని పాత్రలు మరో సినిమాలో కనిపించడం ఇంకా చాలా సినిమాల్లో ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఇలాంటి కాన్సెప్ట్ ల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.