ఈ ఏడాది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

  • December 27, 2022 / 08:10 PM IST

కరోనా రాకముందు కూడా ఓటీటీల హవా ఉంది. కానీ కరోనా వల్ల లాక్ డౌన్ ఏర్పడటంతో థియేటర్లు మూతపడ్డాయి. ఆ టైంలో ఫ్యాన్సీ రేటు దక్కించుకుని నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆ సినిమాలు ఎలాంటి టాక్ ను అందుకున్నాయి? ఎలాంటి ఫలితాలను అందుకున్నాయి? అనే విషయాలు తర్వాత. చిన్న సినిమాలకు మాత్రం ఆ టైంలో మంచి మార్గం చూపాయి అని చెప్పొచ్చు. అప్పటినుండి ఫ్యామిలియర్ క్యాస్టింగ్ ఉంటే.. మంచి రేటుకు చిన్న సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. లాక్ డౌన్ ఎత్తేశాక కూడా చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుండటం విశేషం. 2022 లో కూడా చాలా సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మంచి ఫలితాలను అందుకున్నాయి. ఆ విధంగా చిన్న సినిమాలకు ఓటీటీలు కల్పవృక్షం లా మారిపోయింది అని చెప్పొచ్చు. సరే ఇంతకీ ఈ 2022 లో ఓటీటీల్లో నేరుగా రిలీజ్ అయిన సినిమాలు ఏంటో.. వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మహాన్ : విక్రమ్ మరియు అతని కొడుకు ధృవ్ కలిసి నటించిన ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

2) భామాకలాపం : ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఆహాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

3) చిన్ని( ‘సాని కాయిదం’ తమిళ్ లో) : కీర్తి సురేష్ మరియు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి టాక్ ను రాబట్టుకుంది.

4) మళ్ళీ మొదలైంది : సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీ నేరుగా జీ5 లో రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

5) పుజు : మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా సోనీ లివ్ లో రిలీజ్ అయ్యింది. దీనికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

6) బ్లడీ మేరీ : నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఆహాలో రిలీజ్ అయ్యింది. పర్వాలేదు అనిపించే విధంగా టాక్ ను సొంతం చేసుకుంది.

7) ఇంటింటి రామాయణం : రాహుల్ రామకృష్ణ, సీనియర్ నరేష్, నవ్య స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఆహాలో రిలీజ్ అయ్యింది.

8) కిన్నెరసాని : కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా నేరుగా జీ5 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పర్వాలేదు అనిపించింది.

9) అందరూ బాగుండాలి అందులో నేనుండాలి : అలీ, నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఆహా లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది.

10) రిపీట్ : నవీన్ చంద్ర, మధుబాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది.

11) ఓ2 : నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా రిలీజ్ అయ్యింది.

12) ఓదెల రైల్వే స్టేషన్ : హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఆహాలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus