Venkatesh Rejected Movies: 35 ఏళ్ళ సినీ కెరీర్లో వెంకటేష్ వదులుకున్న సినిమాల లిస్ట్..!
January 16, 2022 / 07:32 PM IST
|Follow Us
ఈరోజుతో ‘కలియుగ పాండవులు’ సినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు పూర్తికావస్తోంది. అంటే మన విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 35 ఏళ్ళు అవుతుందన్న మాట. నిజానికి 1971 వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వర రావు గారు హీరోగా కె.ఎస్.ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ నిర్మాణంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘ప్రేమ్ నగర్’ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు వెంకీ. అయితే హీరోగా మారింది మాత్రం కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతోనే.! మొదట ఆ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారిని హీరోగా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన చేయలేకపోవడంతో వెంకటేష్ ను హీరోగా లాంచ్ చేసి ఆ ప్రాజెక్టుని ఫినిష్ చేశారు రామానాయుడు గారు.ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది కూడా..!
కృష్ణ గారు రిజెక్ట్ చేయడం వలన టాలీవుడ్ కు ఓ మంచి స్టార్ హీరో దొరికాడనే చెప్పాలి. అందరి స్టార్ హీరోలలా ఒకటే కమర్షియల్ ఫార్మేట్ లో సినిమాలు తీసి బోర్ కొట్టించే వారు కాదు వెంకీ. నటనకి స్కోప్ ఉన్న సినిమాలనే చేసేవారు. ఎటువంటి పాత్రని అయినా ఎంతో ఈజ్ తో చేసేవారు వెంకీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ తోనే భారీ వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేవారు అంటే అతిశయోక్తి కాదు. అయితే బిజీ షెడ్యూల్ వలనో లేక కథ నచ్చకపోవడం వలనో కానీ ఈ 35 ఏళ్ళలో కొన్ని సినిమాలను ఆయన రిజెక్ట్ చేశారు. ఇందులో కొన్ని సూపర్ హిట్లు కూడా ఉండడం గమనార్హం. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1)’ఘర్షణ'(1988) :
నాగార్జున, వెంకటేష్ లతో మణిరత్నం ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ గా తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ ఎందుకో అటు నాగ్ కానీ ఇటు వెంకీ కానీ ఇంట్రెస్ట్ చూపలేదు.
2) రోజా :
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన మరో సూపర్ హిట్ మూవీ ఇది.ఇందులో హీరోగా మొదట వెంకటేష్ నే అనుకున్నారు మణిరత్నం. కానీ వెంకీ ఈ మూవీని రిజెక్ట్ చేశారు.
3) ఒకే ఒక్కడు :
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ మూవీలో హీరోగా నటించే అవకాశం మొదట విజయ్ కు దక్కింది. కానీ అతను వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో వెంకటేష్ ను కూడా సంప్రదించారు శంకర్. కానీ వెంకీ కూడా బిజీగా ఉండడంతో ఇది అర్జున్ తో చేసి సూపర్ హిట్ కొట్టారు.
4) సంతోషం :
దర్శకుడు దశరథ్ మొదట ఈ కథని సురేష్ బాబు, వెంకటేష్ లకి వినిపించారు. కానీ ఎందుకో వెంకీ ఈ మూవీని రిజెక్ట్ చేశారు.
5) ఖడ్గం :
ఇందులో శ్రీకాంత్ పాత్రకి మొదట వెంకటేష్ ను అనుకున్నారు. కానీ వెంకీ అప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు చేయలేదు.
6) కృష్ణం వందే జగద్గురుమ్ :
క్రిష్ ఈ ప్రాజెక్టుని మొదట వెంకీతో అనుకున్నారు. కానీ వెంకీ చేయలేకపోవడంతో రానా చేయడం జరిగింది.
7) ‘గోవిందుడు అందరివాడేలే’ :
రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రకి మొదట వెంకటేష్ ను అనుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. కానీ వెంకీ సున్నితంగా రిజెక్ట్ చేశారు.
8) ‘క్రాక్’ :
గోపీచంద్ మలినేని మొదట ఈ కథని బాలయ్యని దృష్టిలో పెట్టుకుని రాసాడు. కానీ బాలయ్య ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత వెంకీని కూడా సంప్రదిచాడు. ఎందుకో వెంకీ కూడా రిజెక్ట్ చేయడంతో రవితేజ చేయడం.. అది సూపర్ హిట్ అవ్వడం జరిగింది.
9) ఆడాళ్ళు మీకు జోహార్లు :
శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. మొదట ఈ కథ వెంకీ వద్దకి వెళ్ళింది. కానీ వెంకీ ఇంట్రెస్ట్ చూపలేదు.
10) ‘కర్ణన్’ రీమేక్ :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఈ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. అయితే మొదట సురేష్ బాబు.. వెంకటేష్ తో ఈ రీమేక్ ను చేయాలనుకున్నారు. కానీ ఈ ‘కర్ణన్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చదు అని వెంకీ తేల్చి చెప్పేసి మరీ వద్దన్నాడట.